హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన ఆటా వేడుకల గ్రాండ్ ఫినాలే

Featured Image

అమెరికా తెలుగు సంఘం(ఆటా) ఆధ్వర్యంలో డిసెంబర్ 11 నుంచి 27 మధ్య తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నిర్వహించిన ఆటా వేడుకలు–2025 సేవా కార్యక్రమాలు ఘనంగా ముగిశాయి. సేవ, విద్య, సంస్కృతి, వ్యాపార రంగాల్లో మొత్తం 15 రోజుల పాటు పలు కార్యక్రమాలు నిర్వహించారు.

- డిసెంబర్ 11న ఆటా అధ్యక్షుడూ జయంత్ చల్లా, తదుపరి అధ్యక్షుడూ సతీష్ రామసహాయం రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధుల బృందం మంత్రి శ్రీధర్ బాబును కలసి ఆటా కార్యక్రమాల వివరాలు తెలిపారు. 12న హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో కార్యక్రమాల పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. డిసెంబర్ 12 నుంచి 27 వరకు స్కాలర్‌షిప్‌లు, విద్యా సెమినార్లు, యువజన కార్యక్రమాలు, క్రీడా పోటీలు, ఆరోగ్య శిబిరాలు, పాఠశాల అభివృద్ధి, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.

- డిసెంబర్ 12న రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆటా స్కాలర్‌షిప్‌లు పంపిణీ చేశారు.

-డిసెంబర్ 13న ఐఐటీ హైదరాబాద్‌లో నిర్వహించిన ఆటా స్టార్టప్ పిచ్ డే నిర్వహించారు.

-డిసెంబర్ 14న సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ సాహిత్య సదస్సు నిర్వహించారు.

-డిసెంబర్ 15న యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఆటా ప్రతినిధులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

-డిసెంబర్ 17న విశాఖలో జరిగిన వాణిజ్య సదస్సులో యుఎస్ కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ పాల్గొన్నారు. వచ్చే ఏడాది జూలై 31న జరిగే 19వ ఆటా మహాసభలకు సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు.

-డిసెంబర్ 19న డల్లాస్ కాల్పుల్లో మరణించిన వ్యక్తి కుటుంబానికి గోఫండ్‌మీ ద్వారా సేకరించిన రూ.50 లక్షలు అందజేస్తామని ఆటా ప్రకటించింది. హైదరాబాద్ టి-హబ్‌లో నిర్వహించిన బిజినెస్ సెమినార్‌లో లారా విలియమ్స్, మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను కలిసి ఆటా గ్రాండ్ ఫినాలే, 2026 అమెరికా మహాసభలకు ఆహ్వానించారు.

-డిసెంబర్ 20 నుంచి 24 వరకు నాగర్‌కర్నూల్, జగిత్యాల, మహబూబ్‌నగర్, సూర్యాపేట, సిద్ధిపేట జిల్లాల్లో పర్యావరణం, క్రీడలు, మహిళల ఆరోగ్యం, పాఠశాల అభివృద్ధి, ఆరోగ్య శిబిరాలు నిర్వహించారు.

-డిసెంబర్ 27న హైదరాబాద్ రవీంద్రభారతిలో ఆటా వేడుకలు–2025 గ్రాండ్ ఫినాలే జరిగింది. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు ఏ. కోదండరాం రెడ్డికి ఆటా జీవిత సాఫల్య పురస్కారం అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఎన్. రామచంద్ర రావు, చామల కిరణ్ కుమార్ రెడ్డి, మల్లారెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, నరసింహారెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి పాల్గొన్నారు. ఆటా ఎక్సలెన్స్ అవార్డులు యడ్లపల్లి వెంకటేశ్వరరావు, అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, దీపికా రెడ్డి, డా. ఈ. శివనాగి రెడ్డి, అయ్యగారి శ్రీదేవి, దాసరి శ్రీలక్ష్మి రెడ్డి, కల్యాణి ద్విభాష్యం, డా. రమ్య సౌజన్య, డా. ములే రామముని రెడ్డి, పి. నరేందర్ రెడ్డి, ఏ. లోహిత్ కుమార్, హరినాథ రెడ్డి, మాస్టర్ గండ్రెట్టు తపాస్‌కు అందజేశారు. కార్యక్రమాల విజయానికి సహకరించిన బోర్డ్ ఆఫ్ ట్రస్టీ, కో-చైర్ నరసింహ ద్యాసాని, సాయి సుధిని, శ్రీకాంత్ గుడిపాటి, విజయ్ గోలి, శ్రీధర్ బాణాల, కాశీ కొత్త, రామకృష్ణ అలా, సుధీర్ దామిడి, శ్రీధర్ తిరిపతి, పరమేష్ భీంరెడ్డి, రాజు కక్కెర్ల, రఘువీర్ మర్రిపెద్ది, వినోద్ కోడూరు, కిషోర్ గూడూరు, నర్సిరెడ్డి గడ్డికోపుల, విష్ణు మాధవరం, హరీష్ బత్తిని, సుమ ముప్పాల, వేణు నక్షత్రం, లక్ష్ చేపూరి, అనంత్ పజ్జూర్, అరవింద్ ముప్పిడి, తిరుమల్ మునుకుంట్ల, ఈశ్వర్ బండా తదితరులు పాల్గొన్నారు.

Tags-ATA Seva Days 2025 Grand Finale In Hyderabad...Kodandaramireddy Felicitated With Lifetime Achievement

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles