సామాజిక మాధ్యమాల వ్యాపారాలపై ట్రంప్ సర్కార్ నిఘా

Featured Image

అమెరికాలో భారత్‌ నుంచి వస్తువులను ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా కొనుగోలు చేయడం ప్రమాదకరంగా మారింది. ఇటీవల కొన్ని అమెరికన్ ఇండియన్ కొనుగోలుదారులకు భారీ జరిమానాలతో పాటు స్థానిక కోర్టుల నుండి నోటీసులు కూడా జారీ అయ్యాయి. భారతీయ రిటైలర్ల నుంచి వస్తువులను కోరియర్‌ ద్వారా తెప్పించుకోవడం అమెరికా సుంక, పన్ను చట్టాలను ఉల్లంఘించినట్టుగా పరిగణిస్తూ, అమెరికా అధికారులు వీటిపై గట్టి నిఘా పెట్టారు. ఈ ఉత్పత్తులపై పన్నులు చెల్లించకపోవడం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు నష్టమవుతుందనే దృష్టితో చర్యలు తీసుకుంటున్నారు.

ఇప్పటివరకు బంధువుల ద్వారా వస్తువులు తెప్పించుకోవడం, చిన్న వ్యాపారాలుగా సామాజిక మాధ్యమాల్లో ఆర్డర్లు తీసుకుని పంపించడం సాధారణంగా కొనసాగుతుండగా, ఇప్పుడు ఇవన్నీ పక్కా పన్ను నియమాలకు లోబడి ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రత్యేకంగా తెలుగువారు, ఇతర రాష్ట్రాల వారికి చెందిన చిన్న వ్యాపారులు ఇండియా నుంచి దుస్తులు, ఆభరణాలు, పాకెట్ ఫుడ్స్ వంటి వస్తువులను తెప్పించి, ట్యాక్స్‌లు లేకుండా కొనుగోలుదారులకు పంపుతున్నారు. ఇప్పుడు ఈ విధానాలు ప్రమాదకరంగా మారాయి. చిన్న వ్యాపారులే కాదు, వ్యక్తిగతంగా తెప్పించుకునేవారిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

సోషల్ మీడియా యాప్‌ల ద్వారా జరుగుతున్న ఈ విపణిపై ట్రంప్‌ సర్కారు 2.0 కఠినంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే కొన్ని షిప్మెంట్లను గుర్తించి, కొనుగోలుదారులకు జరిమానాలు విధించారు. ఇందుకు సంబంధించిన చర్చలు భారతీయుల వాట్సాప్‌ గ్రూపుల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇకపై పన్నులు చెల్లించకుండా ఇండియాలో నుంచి వస్తువులు తెప్పించుకునే ప్రయత్నం చేయొద్దని, అన్ని విధాలుగా జాగ్రత్త వహించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Register for NATS 8th America Telugu Sambaralu in Tampa Florida - www.sambaralu.org

###

In a significant regulatory shift, U.S. authorities have intensified their scrutiny of goods imported from India through informal channels like Instagram, Facebook, WhatsApp, and courier-based app services. Many buyers and small-time resellers across the United States—particularly from the Indian community—have recently received legal notices and hefty fines. The reason: these shipments are being classified as illegal imports due to the absence of proper tax contributions and customs declarations, triggering violations of U.S. trade and tariff laws. Authorities are now actively tracking such purchases, especially those involving clothing, jewelry, pickles, and other consumer products.

The crackdown affects not just full-scale resellers but also individuals who casually source goods from friends or relatives traveling from India. What was once a loosely regulated practice has now drawn federal attention, with a growing number of shipments flagged for bypassing customs duties. The U.S. government, under heightened economic enforcement priorities, appears determined to close even the smallest tax loopholes. This includes goods ordered via India-based apps that facilitate purchases and ship directly to buyers in the U.S., often without any customs documentation or tariff compliance.

Indian-origin micro-entrepreneurs operating on social media platforms are now on alert, especially Telugu-speaking sellers and buyers who are heavily engaged in such informal e-commerce. The risks are no longer theoretical—real fines and legal proceedings are being reported. As the federal crackdown unfolds, both consumers and sellers are urged to exercise extreme caution and ensure tax and customs compliance to avoid penalties. Community groups and WhatsApp forums are abuzz with concern, signaling a growing awareness of the shifting regulatory landscape.

Register for NATS 8th America Telugu Sambaralu in Tampa Florida - www.sambaralu.org

Tags-Dont Shop via Social Media Trump Administration Booking Cases On Tax Evasion

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles