టాంటెక్స్ ఆధ్వర్యంలో ఉగాది కవిసమ్మేళనం

Featured Image

డల్లాస్ ఫోర్ట్ వర్త్‌లో ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) తెలుగు సాహిత్య వేదిక ఆధ్వర్యంలో 213వ నెలనెలా తెలుగువెన్నెల సాహిత్య సదస్సు-ఉగాది కవిసమ్మేళనం ఆదివారం నాడు నిర్వహించారు. కార్యక్రమం ముత్తుస్వామి దీక్షితార్ కీర్తనతో ప్రారంభమైంది. దయాకర్ మాడా స్వాగత వచనాలతో ప్రారంభించి, వడ్డేపల్లి కృష్ణ రచించిన గీతాన్ని పునఃప్రదర్శించారు. తెలుగు పంచాంగం విశిష్టతలపై ప్రసంగించడముతో పాటు, తమాషా క్విజ్‌ ద్వారా శ్రోతలను అలరించారు. అధ్యక్షుడు చంద్రశేఖర్ పొట్టిపాటి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇండియా నుండి వచ్చిన మోహిత కౌండిన్య "పుటల మధ్య ప్రపంచం" కవితను చదివారు. అనంత్ మల్లవరపు, వెంకట్ కొత్తూరు వంటి రచయితలతో పాటు కెనడా నుండి వచ్చిన సువర్ణ విజయ, ధన్వీన్ బ్రాహ్మణపల్లి, నవ్య కొప్పిశెట్టి, శ్రేష్ఠ మిర్యాల, మహతి ఆలమూరు, కృష్ణ భరద్వాజ్ ఆలమూరు, హరిణి మానమ్, విజయలక్ష్మి కందిబండ, శ్రీకాశ్యప్, నక్త రాజు, గోవర్ధనరావు నిడిగంటి తదితరులు తమ రచనలతో ఆకట్టుకున్నారు. రమణ డీ గీతంతో ముగింపు పలికారు. 83 నెలలుగా కొనసాగుతున్న "మన తెలుగుసిరిసంపదలు"లో డా.యు.నరసింహారెడ్డి పదసంపద, ప్రహేళికలు, పొడుపు కథలు అందించారు.

దయాకర్ మాడా వందన సమర్పణ చేయగా, అధ్యక్షుడు చంద్రశేఖర్ పొట్టిపాటి, ఉత్తరాధ్యక్షురాలు మాధవి లోకిరెడ్డి, తక్షణ పూర్వాధ్యక్షుడు సతీష్ బండారు, పాలక మండలి అధ్యక్షుడు డాక్టర్ తిరుమలరెడ్డి కొండా,సంస్థ పూర్వాధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ తోటకూర, సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, శారదా సింగిరెడ్డి, ప్రొఫెసర్ రామ్ దంతు, కిరణ్మయి వేముల, గౌతమి పాణ్యం, స్వర్ణ అట్లూరి, రాజారెడ్డి, హరి సింగం, రాజేష్ అడుసుమిల్లి, పరమేష్ దేవినేని, లెనిన్ బందా, రాజశేఖర్ మూలింటి, శ్రీధర్, ముక్కు శ్రీనివాస్, రాజాచంద్ర, రాంబాబు, ఉపేంద్ర, శ్రీనివాస్ డీ, కిరణ్, సంతోష్, నాగ సౌందర్య, జగదీశ్, సరోజ కొమరవోలు, సుధ, గీత దమ్మన, విజయ మామునూరి, నగేష్ పులిపాటి, నవీన్ గొడవర్తి తదితరులు పాల్గొన్నారు.

Register for NATS 8th America Telugu Sambaralu in Tampa Florida - www.sambaralu.org

Tags-TANTEX 213th NNTV Ugadi KaviSammelanam 2025

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles