హాంకాంగ్‌లో వేడుకగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

Featured Image

హాంకాంగ్ తెలుగు సమాఖ్య(THKTS) ఆధ్వర్యంలో తుంగ్ చుంగ్‌లోని NAAC సెంటరులో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు జయ పీసపాటి కోవిద్ మహమ్మారి సమయంలో పిల్లలు, తల్లిదండ్రులలో మాతృభాష ప్రాముఖ్యతను ప్రోత్సహించాలని ఆమె ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అందులో భాగంగా ఈ వేడుకలు నిర్వహించారు.

UNESCO హాంకాంగ్ అసోసియేషన్ గ్లోబల్ పీస్ సెంటర్, NAAC, టుమారోస్ యూత్ డెవెలెప్మెంట్ ఫండ్ లిమిటెడ్ వేడుకలకు మద్దతునిచ్చారు. UHKA గ్లోబల్ పీస్ సెంటర్‌లో కమ్యూనిటీ విభాగానికి కో-చైర్‌గా సేవలందిస్తున్న తిరునాచ్ నాచియాపన్ ఈ ఏడాది వేడుకలకు కన్వీనర్‌గా వ్యవహరించారు. ఈ ఏడాది యూత్ వాయిసెస్ ఆన్ మల్టీలింగ్వల్ ఎడ్యుకేషన్ థీంతో నిర్వహించిన వేడుకల్లో పిల్లలు ఉత్సాహంగా నృత్య గాన ప్రదర్శనలు చేశారు. సంస్కృతం, ఇంగ్లీష్, కొరియన్, చైనీస్, బంగ్లా, హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మార్వారీ, మరాఠీ మాతృభాషల పట్ల తమ ప్రేమను ప్రదర్శించారు.

హాంకాంగ్, మకావులోని భారత కాన్సులేట్ జనరల్ నుండి సురభి గోయల్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. సమాఖ్య ఆధ్వర్యంలో ప్రతి ఏటా మాతృభాష దినోత్సవాన్ని నిర్వహిస్తున్నందుకు అభినంచించారు. పిల్లలు తమ మాతృ భాష నేర్చుకుంటున్నందుకు, అభిమానిస్తున్నందుకు వారి తల్లిదండ్రుల ప్రయత్నాలను ప్రశంసించారు. భవిష్యత్తును, ప్రతిభావంతులుగా ఎదుర్కోగల ప్రపంచ పౌరులుగా మారడానికి బహుభాషా నైపుణ్యం తప్పనిసరి అని పేర్కొన్నారు. ఆధునిక హిందీ సాహిత్య పితామహుడు భరతేందు హరిశ్చంద్రను ఉటంకింస్తూ మాతృభాష జాతీయ, వ్యక్తిగత పురోగతికి పునాది అని చెప్పారు.

కోనీ వాంగ్, మారకో క్వాన్గ్, జాకీ చెంగ్, చైనా బాంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్ సెంటర్ అధ్యక్షులు డా.ఇస్లాం ముహమ్మద్ ఫ్యాక్రుల్ బాబులు అతిథులుగా హాజరయ్యారు. బహుళ సంస్కృతులు కలిగిన దేశంలో, ప్రప్రథంగా తమ సమాఖ్య విభిన్న సమాజాలను వారి మాతృభాషలను కొనియాడటానికి వేడుకగా జరుపుకోవడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందంగా ఉందని హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు జయ పీసపాటి అన్నారు. చిన్నారులకు సురభి గోయల్ ధృవీకరణ పత్రాలను బహూకరించారు.

Tags-Hong Kong Telugu Samakhya THKTS Celebrates International Mother Language Day

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles