హౌడీ మోదీ సభపై వరుణుడి దెబ్బ పడుతోంది.
పెను తుఫాను ‘ఇమెల్డా‘ కారణంగా టెక్సస్ రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. 10 కౌంటీల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు.
హ్యూస్టన్‌లో భారీ వర్షాలకు ఇద్దరు మరణించారు. అనేకచోట్ల రోడ్లపై జలప్రవాహాలతో ప్రజారవాణా స్తంభించింది.
ఇళ్లు విడిచి బయటకు రావొద్దని, ఆఫీసుల్లో, స్కూళ్లలో ఉన్నవారు అక్కడే ఉండిపోవాలని హ్యూస్టన్ మేయర్ సిల్విస్టర్ టర్నర్ హెచ్చరించారు.
ఈ పెనుతుఫాను వల్ల హౌడీ మోదీ సభ జరిగే ఎన్‌ఆర్‌జీ స్టేడియంలోనూ, నగరంలోనూ ఏర్పాట్లకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.
సభకు ఎలాంటి అడ్డంకులూ ఉండబోవని, 1500 మంది వాలంటీర్లు రేయింబవళ్లు కష్టపడుతున్నారని వారి నేత అచలేష్ అమర్ చెప్పారు.