ఉత్సాహంగా నాట్స్ లాస్ ఏంజిల్స్ మహిళా సంబరాలు

Featured Image

ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) ఆధ్వర్యంలో లాస్ ఏంజిల్స్‌లో మహిళా సంబరాలను నిర్వహించారు. లాంగ్ బీచ్‌లోని కాబ్రిల్లో హైస్కూల్‌లో నిర్వహించిన ఈ మహిళా సంబరాలకు మంచి స్పందన లభించింది. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులు అర్పించారు. తెలుగు ఆడపడుచులు చేసిన కోలాటం ఉత్సాహాన్ని నింపింది. చీరకట్టు ప్రత్యేకతను ప్యాషన్ షో ద్వారా చూపించారు. సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

మహిళా సంబరాల విజయవంతానికి దోహదపడిన వారికి నాట్స్ లాస్ ఏంజిల్స్ విభాగం ధన్యవాదాలు తెలిపింది. తెలుగు సంస్కృతి, సంప్రదాయల పరిరక్షణలో నాట్స్ ఎప్పుడూ మందుంటుందని నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని అన్నారు. జూలై 4,5,6 తేదీల్లో టంపా వేదికగా జరిగే 8వ అమెరికా తెలుగు సంబరాలకు లాస్ ఏంజిల్స్‌లో తెలుగు వారంతా తరలిరావాలని ఆయన కోరారు. నాట్స్ విద్య, ఆరోగ్యం, సామాజిక సేవ, సాంస్కృతిక పరరిక్షణ కోసం కృషి చేస్తుందని నాట్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి అన్నారు.

నాట్స్ ప్రతినిధులు మధు బోడపాటి, కిషోర్ గరికపాటి, శ్రీనివాస్ చిలుకూరి, రాజలక్ష్మి చిలుకూరి, మనోహర్ మద్దినేని, నాట్స్ లాస్ ఏంజిల్స్ విభాగం కో ఆర్డినేటర్ మురళీ ముద్దన, జాయింట్ కో ఆర్డినేటర్ బిందుమాలిని, మహిళా సంబరాల ఆర్గనైజింగ్ టీమ్‌ శ్రీనివాస మునగాల, రేఖ బండారి, సతీష్ యలవర్తి, లత మునగాల, సుధీర్ కోట, సిద్ధార్థ కోలా, భవ్యత పండ్రంగి, శంకర్ సింగంశెట్టి, అరుణపాల్ రెడ్డి, హరిష్ సింగంశెట్టి, ముకుంద్ పరుచూరి, అరుణ బోయినేని, శ్రీపాల్ రెడ్డి, హరీష్ అండె, చంద్ర మోహన్ కుంటుమళ్ళ, పద్మజ గుడ్ల, సరోజా అల్లూరి, వెంకట్ ఆలపాటి తదితరులు సహకరించారు.

Register for NATS 8th America Telugu Sambaralu in Tampa Florida - www.sambaralu.org

Tags-NATS Los Angeles Womens Day Celebrations 2025

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles