వైభవంగా లండన్ తెలుగు సంఘం 20వ వార్షికోత్సవం

Featured Image

లండన్ తెలుగు అసోసియేషన్ (TAL) 20వ వార్షికోత్సవంతో పాటు ఉగాది వేడుకలు శనివారం నాడు తూర్పు లండన్‌లోని లేక్‌వ్యూమార్కీలో ఘనంగా నిర్వహించారు. ఈవెంట్ కన్వీనర్ రవీందర్ రెడ్డి గుమ్మకొండ, కల్చరల్ ట్రస్టీ శ్రీదేవి ఆలెద్దుల సబను ప్రారంభించారు. ఉగ్రదాడిలో మృతిచెందిన వారికి సంతాపంగా మౌనాన్ని వహించారు. ఛైర్మన్ రవి సబ్బా TAL బలోపేతానికి కృషిచేసిన పూర్వ కార్యవర్గ సభ్యులను సత్కరించారు. TAL వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ రాములు-స్వదేశ్ దాసోజు దంపతులను వ్యవస్థాపక సభ్యులు శ్రీధర్ వనం, రామానాయుడు బోయల్లలు సత్కరించారు.

రామ్ మిరియాల బృందం లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ ద్వారా ప్రేక్షకులను అలరించారు. నటి భానుశ్రీ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. TAL సాంస్కృతిక కేంద్రం(TCC) విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. యక్షగానం, భారతీయ శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు వేడుకకు వైభవాన్ని తీసుకువచ్చాయి. సూర్య కందుకూరి, రమేష్ కలవల ఆధ్వర్యంలో రూపొందించిన TAL వార్షిక పత్రిక 'మా తెలుగు 2025'ను ఆవిష్కరించారు. స్పోర్ట్స్ ఇన్ ఛార్జ్ సత్య పెద్దిరెడ్డి TAL ప్రీమియర్ లీగ్ (TPL) T20 క్రికెట్ సీజన్‌ను ప్రారంభించారు. ఫండ్ రైసింగ్ ట్రస్టీలు వెంకట్ నీలా, రవి మోచెర్ల, అనిల్ అనంతుల, అశోక్ మాడిశెట్టి, కిరణ్ కప్పెట, రాయ్ బొప్పన, భారతి కందుకూరి, బాలాజీ కల్లూరు, గిరిధర్ పుట్లూరు, లక్ష్మణ్ కోట, కిషోర్ కస్తూరి, పవన్ తిరునగరి, వాసుమేరెడ్డి, విజయ్ బెలిదే తదితరులు పాల్గొన్నారు.

Tags-Telugu Assoc of London TAL 20th Anniversary Ugadi 2025

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles