9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు సభా విశేష సంచిక ఆవిష్కరణ

Featured Image

ఖతార్ దోహాలో 2024 నవంబరులో జరిగిన '9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు' సభా విశేష సంచికను వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా మరియు ఆంధ్ర కళా వేదిక - ఖతార్ సంయుక్తంగా అంతర్జాల మాధ్యమంలో ఆవిష్కరించారు. ఇది మధ్యప్రాచ్యంలో జరిగిన తొలి సాహితీ సదస్సుగా గుర్తింపు పొందింది. 380 పేజీలతో రూపొందిన ఈ గ్రంథానికి రాధికా మంగిపూడి, విక్రమ్ సుఖవాసి, వంగూరి చిట్టెన్ రాజు, లక్ష్మి రాయవరపు, శాయి రాచకొండ సంపాదకులుగా వ్యవహరించారు.

సదస్సులో భారత్, ఖతార్, అమెరికా, సౌదీ అరేబియా, బహరైన్, యూఏఈ, సింగపూర్ దేశాల నుండి వక్తలు, రచయితలు పాల్గొన్నారు. చెరుకూరి రమాదేవి, వంశీ రామరాజు, అద్దంకి శ్రీనివాస్, బులుసు అపర్ణ, అయ్యగారి సీతారత్నం, త్రివేణి వంగారి, కస్తూరి అలివేణి, దేవులపల్లి పద్మజ, మురళీకృష్ణ, కోనేరు ఉమామహేశ్వరరావు, చివుకుల పట్టాభిరామ శర్మ, కవుటూరు రత్నకుమార్, షేక్ రఫీ, తాడేపల్లి రామలక్ష్మి, శ్రీసుధ, గోవర్ధన్ రెడ్డి, మనీష్, మాధవి లలిత, గౌరీ బొమ్మన పాల్గొని సభ జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. సదస్సు ప్రభావంతో కొత్త రచయితలు ప్రేరణ పొందారని తెలిపారు. ఇతర మధ్యప్రాచ్య దేశాల ప్రతినిధులు 10వ ప్రపంచ సదస్సు తమ దేశాలలో నిర్వహించేందుకు ఉత్సాహం వ్యక్తం చేశారు. కార్యక్రమాన్ని వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు.

Tags-Vanguri Foundation 9th World Telugu Literary Meet Souvenir Launched

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles