నాట్స్ సంబరాల్లో నగల దుకాణాల వద్ద సందడి

Featured Image

ప్రపంచవ్యాప్తంగా యుద్ధమేఘాల నడుమ ఎదగడమే అలవాటుగా భారీ ఒడిదుడుకులకు లోనవుతున్న బంగారం ధరలు అమెరికాలో తెలుగువారిని చేరినట్టు లేవు. టాంపాలోని నాట్స్ సంబరాల్లో ఏర్పాటు చేసిన నగలు, చీరల దుకాణాల వద్ద మహిళల రద్దీ బాగుంది. వేడుకలకు హాజరయిన మహిళలు అన్ని దుకాణాలు ఉత్సాహంగా తిరుగుతున్నారు.

ఈ సంబరాల్లో కాదేది అనర్హం అన్నట్టు...పచ్చళ్లు, రియల్ ఎస్టేట్లు, బిట్‌కాయిన్లు, పనసకాయలు, సపోటాలు, సీతాఫలాలు కూడా స్టాళ్ల వద్ద ప్రచారం చేస్తున్నారు. అమెరికాలో వ్యవసాయ రియల్ ఎస్టేట్‌కు ఉన్న గిరాకీని వివరించే ప్రయత్నం చేస్తున్నారు.

Tags-NATS Day2 Full Rush At Stalls

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles