62మంది చిన్నారుల ఆకలి తీర్చిన డల్లాస్ నాట్స్

Featured Image

రిచర్డ్‌సన్ నగరంలో నాట్స్ డల్లాస్ విభాగం ఫీడ్ మై స్టార్వింగ్ చిల్డ్రన్స్ సంస్థతో కలిసి 22,680 భోజనాలను సిద్ధం చేశారు. స్థానిక ప్రవాస యువతీ యువకులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ప్రయత్నం ద్వారా 62 మంది పిల్లలకు ఒక సంవత్సరం పాటు పౌష్టికాహారం అందజేస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

నాట్స్ పూర్వ అధ్యక్షుడు బాపు నూతి, నాట్స్ డల్లాస్ చాప్టర్ జట్టు కో-ఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ, శ్రావణ్ నిడిగంటి, సౌజన్య రావెళ్ళ, పావని నున్న, నాట్స్ డల్లాస్ చాప్టర్ అడ్వైజర్ సురేంద్ర ధూళిపాళ్ల, రాజేంద్ర మాదాల, రవి తాండ్ర, కిషోర్ నారె, సత్య శ్రీరామనేని, సుమతి మాదాల, శివ మాధవ్, బద్రి బియ్యపు, కిరణ్ నారె తదితరులు పాల్గొన్నారు. చిన్నారుల ఆకలి తీర్చే సేవా కార్యక్రమ నిర్వహణ పట్ల నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటిలు హర్షం వ్యక్తం చేశారు.

Register for NATS 8th America Telugu Sambaralu in Tampa Florida - www.sambaralu.org

Tags-NATS Dallas Helps Feed 62 Poor Kids For One Year

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles