
బీఆర్‌ఎస్ రజతోత్సవ వేడుకలకు సిద్ధమవుతున్న డల్లాస్

బీఆర్‌ఎస్ పార్టీ 25ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకొని జూన్ 1న అమెరికాలోని డల్లాస్ నగరంలోని Dr Pepper Arena వేదికగా రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు బీఆర్‌ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాల తెలిపారు.
ఈ సందర్భంగా డల్లాస్ నగరాన్ని మహేష్ బిగాల, యూఎస్ఏ అడ్వైజరీ బోర్డు చైర్మన్ తన్నీరు మహేష్, స్థానిక బీఆర్‌ఎస్ నేతలు, అభిమానులు సందర్శించి Dr Pepper Arena కామెరికా సెంటర్లో ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంటల తారక రామారావు (కేటీఆర్) హాజరవుతారని మహేష్ బిగాల వెల్లడించారు. ఇది ఓ వేడుకే కాకుండా, తెలంగాణ ఉద్యమ ఆత్మను ప్రపంచానికి వినిపించే గొప్ప వేదికగా మారుతుందని నిర్వాహకులు అన్నారు. ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ సాంస్కృతిక కళాపరిషత్ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించనున్నాయి.
బీఆర్‌ఎస్ యూఎస్ఏ అడ్వైజరీ బోర్డు చైర్మన్ తన్నీరు మహేష్ మాట్లాడుతూ — అమెరికాలోని వివిధ రాష్ట్రాల బీఆర్‌ఎస్ మద్దతుదారులు, అనుబంధ సంఘాలు ఈ కార్యక్రమాన్ని సమన్వయపరుస్తున్నాయని తెలిపారు. అమెరికాలో బీఆర్‌ఎస్ చరిత్రలో మైలురాయిగా నిలిచే వేడుక అవుతుందని అన్నారు. శ్రీనివాస్ శురభి, హరీష్ రెడ్డి, శ్రీనివాస్ సురకంటి తదితరులు పాల్గొన్నారు.
Register for NATS 8th America Telugu Sambaralu in Tampa Florida - www.sambaralu.org
Tags-BRS Dallas 25th Anniversary In Dr Pepper Arena Review
bodyimages:

Latest Articles
- Ata Orlando Conducts Stem Cell Drive
- Ata Detroit Celebrates Mother’S Day
- Daggubati Purandeswari Appointed To Key Role Against Terrorism
- Tdp Germany Mini Mahanadu 2025
- Brs 25Th Anniversary In Dallas
- Apts Chairman Mannava Mohanakrishna Stats 26 District Offices
- Ata Philadelphia Celebrates Mothers Day 2025
- Ata Chicago 2025 Mothers Day Celebrations
- Tana Conference 2025 Call For Award Nominations
- American Telugu Assoc Ata 2025 Mothers Day Celerbations