పురందేశ్వరికి మరో కీలక పదవి

Featured Image

పాకిస్థాన్‌ కుతంత్రాలను అంతర్జాతీయ వేదికపై ఎండగట్టేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన బృందాల్లో ఏపీ భాజపా అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరికి చోటు కల్పించారు. పహల్గామ్‌ ఘటన నేపథ్యంలో భారత్ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ గురించి ప్రపంచదేశాలకు వివరించడానికి భారత్‌ దౌత్య యుద్ధం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 33 దేశాల రాజధానులకు వెళ్లేందుకు వివిధ పార్టీలకు చెందిన మొత్తం 59 మందితో ఏడు అఖిలపక్ష బృందాలను కేంద్రం ఏర్పాటు చేసింది.

ఇందులో భాగంగా యుకే, ఫ్రాన్స్, జర్మనీ, ఈయూ, ఇటలీ, డెన్మార్క్ దేశాల్లో పర్యటించే ఎనిమిది మంది సభ్యుల బృందంలో ఎంపీ పురందేశ్వరి ఉన్నారు. ఈ బృందానికి భాజపా సీనియర్ నేత, ఎంపీ రవిశంకర్ ప్రసాద్ నాయకత్వం వహిస్తారు. పహల్గామ్‌ ఉగ్రదాడిలో 26 మంది సామాన్యులు ప్రాణాలు కోల్పోవడం, అందుకు ప్రతిగా భారత్‌ చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఉగ్రవాదం గురించి వారు వివరిస్తారు.

అనేక సంవత్సరాలుగా భారతదేశాన్ని దెబ్బతీసేందుకు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోన్న పాకిస్థాన్ బుద్ధిని ప్రపంచం ముందు బయటపెట్టడానికి, మనదేశంపై పాకిస్థాన్‌ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎండగట్టడానికి ఏర్పాటుచేసిన అఖిలపక్ష బృందంలో తనకు చోటు దక్కడం ఆనందంగా ఉందని ఎంపీ పురందేశ్వరి ఒక ప్రకటనలో తెలిపారు. ఉగ్రవాదులను ఎదుర్కొని ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్లకు, పౌరులకు నివాళులు అర్పించడానికి ఇదొక చిన్న మార్గమని ఆమె పేర్కొన్నారు. దేశానికి ప్రాతినిధ్యం వహించడానికి వచ్చిన అరుదైన అవకాశంగా, గౌరవంగా భావిస్తున్నానని ఆమె చెప్పారు.

Register for NATS 8th America Telugu Sambaralu in Tampa Florida - www.sambaralu.org

Tags-Daggubati Purandeswari Appointed To Key Role Against Terrorism

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles