హాంగ్‌కాంగ్‌లో కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం

Featured Image

హాంగ్ కాంగ్‌లో కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా 'సురభి ఏక ఎహసాన్' పేరిట ప్రత్యేక కార్యక్రమం జరగింది. ఈ కార్యక్రమాన్ని రేడియో వ్యాఖ్యాత జయ పీసపాటి గత తొమ్మిదేళ్లుగా నిర్వహిస్తున్నారు. 'జై హింద్' అనే రేడియో కార్యక్రమం ద్వారా ఆమె సైనికుల జీవితాలను, వారి కుటుంబాల త్యాగాలను ప్రజలకు పరిచయం చేస్తూ వస్తున్నారు. వివిధ విభాగాల్లో పనిచేసిన సైనికులతో, కార్గిల్ యుద్ధానికి సంబంధించి సేవలందించిన వారితో ఆమె రేడియో కార్యక్రమం ద్వారా పరిచయమవుతూ, వారిని వెలుగులోకి తెస్తున్నారు.

ఈ ఏడాది నిర్వహించిన కార్యక్రమంలో బాలల చిత్రలేఖన పోటీలు, హిందీ భాషలో కవితా, గీత రచనల పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా భారత తాత్కాలిక కాన్సుల్ జనరల్ సురభి గోయల్, భారతీయ గోర్ఖా రెజిమెంట్‌కు చెందిన విశ్రాంత జవాన్లు, స్థానిక సంస్థ టచ్ సెంటర్‌కు చెందిన కోనీ వాంగ్ తదితరులు హాజరయ్యారు. కార్యక్రమంలో కెప్టెన్ అఖిలేష్ సక్సేనా తన కార్గిల్ యుద్ధ అనుభవాలను అందరితో పంచుకున్నారు.

సాంస్కృతిక కార్యక్రమాల్లో పిల్లలు, పెద్దలు దేశభక్తి గీతాలు, నృత్యాలతో పాల్గొన్నారు. పోటీ విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. జయ పీసపాటి, ఈ కార్యక్రమం ద్వారా భారత సైనికుల జీవితాల పట్ల అవగాహన పెంపొందుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమం జాతీయ గీతంతో ముగిసింది. పదవ వార్షికోత్సవాన్ని మరింత భిన్నంగా నిర్వహిస్తామని జయ తెలిపారు.

Tags-Surabhi Ek Ehsan Remembering Kargil Warriors In Hong Kong By Jaya Peesapaty

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles