అట్లాంటాలో ఘనంగా ఆటా దినోత్సవం

Featured Image

అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) అట్లాంటా విభాగం ఆధ్వర్యంలో ఆదివారం నాడు ఆటా దినోత్సవాన్ని ఆల్ఫరెట్టాలోని డెనెసా మిడిల్ స్కూల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళ-మాతృ దినోత్సవ వేడుకలను సైతం ఏర్పాటు చేశారు. భారత కాన్సుల్ జనరల్ రమేష్ బాబు లక్ష్మణన్ ముఖ్య అతిథిగా పాల్గొని మాతృమూర్తుల విలువ, మహిళ సాధికారతపై ప్రసంగించి, ఆటా సంస్థ కార్యక్రమాలను అభినందించారు. శ్రావణి రాచకుల్లా, స్పందన అల్తాటి ఫ్యాషన్ షోను సమన్వయపరిచారు. సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. స్థానిక ప్రవాస కళాకారుల లైవ్ మ్యూజికల్ కాన్సర్ట్ అలరించింది.

11 మంది ప్రవాసులకు ఆటా గౌరవ పురస్కారాలు రమేష్ బాబు లక్ష్మణన్, ఆటా అధ్యక్షుడు చల్లా జయంత్, తదుపరి అధ్యక్షుడు సతీష్ రెడ్డి, కోశాధికారి గుడిపాటి శ్రీకాంత్‌లు అందజేశారు. అట్లాంటా ప్రముఖులు రత్నాకర్ ఎలుగంటి, బాలా ఇండుర్తి, ప్రదీప్ ముడుపు, అంజయ్య చౌదరి లావు, రంగారావు సుంకర, హనుమాన్ నందనంపాటి, డా. శోభా చోక్కలింగం, అపర్ణా భట్టాచార్య, ఆర్య ఉపాధ్యాయ, కమక్షి ధనరాజ్, డా. సుజాత రెడ్డి అవార్డులను అందుకున్న వారిలో ఉన్నారు. ఆటా మాజీ అధ్యక్షుడు డా. కరుణాకర్ అసిరెడ్డికి గౌరవ పురస్కారం అందజేశారు.

కిరణ్ తడకమల్లా, అనిల్ కుశ్నపల్లి, చంద్రశేఖర్ అల్తాటి. వుమెన్స్ కోఆర్డినేటర్స్ స్వాతి రెడ్డి, సేవ కోఆర్డినేటర్ అనిల్ చిమిలి, ప్రాంతీయ డైరెక్టర్ సందీప్ రెడ్డి, ప్రాంతీయ వుమెన్స్ చైర్ శృతి చిత్తోరి, బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు:అనిల్ బొద్దిరెడ్డి, శ్రీరామ్ శ్రీనివాస్, శ్రీధర్ తిరుపతి, కిరణ్ రెడ్డి పాశం, సలహాదారులు: కరుణ అసిరెడ్డి, నరేందర్ చెమర్ల, వెంకట్ వీరనేని, కెకే రెడ్డి, రామకృష్ణ, కిషోర్ గూడూరు తదితరులు పాల్గొన్నారు.

Register for NATS 8th America Telugu Sambaralu in Tampa Florida - www.sambaralu.org

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles