🕑 Published: June 06, 2026 at 11:14 AM CST
జర్మనీలో మినీ మహానాడు ఘనంగా నిర్వహించారు. ఐర్లాండ్, నెదర్లాండ్స్, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ నుంచి ప్రవాసాంధ్రులు తరలివచ్చారు. ముఖ్య అతిథులుగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్లా మాధవి, ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ, గుంటూరు మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. జర్మనీ ఎన్నారై తెదేపా వెబ్ సైట్ ను మాధవి ఆవిష్కరించారు.
జ్యోతి ప్రజ్వలన, మా తెలుగు తల్లికి గీతాలాపనలతో కార్యక్రమం ప్రారంభమైంది. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మాధవి మాట్లాడుతూ...రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్ల కేటాయించాలని తెదేపా అధిష్టానం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని వక్తలు కొనియాడారు. నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ.. కుటుంబం కన్నా ప్రజలకే ఎన్టీఆర్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే వారిని పేర్కొన్నారు. సామాజిక న్యాయాన్ని చిత్తశుద్ధితో అమలుచేసిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుందని రామకృష్ణ తెలిపారు. కూటమి ప్రభుత్వ 24 నెలల పాలనలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో 20ఏళ్ల ముందుకు సాగిందని మన్నవ సుబ్బారావు అన్నారు.
రామ్ బొల్లా, మహానాడు కో-ఆర్డినేటర్ వంశీ దాసరి, ఎన్నారై తెదేపా నాయకులు వెంకట్ ఖండ్ర, శ్రీకాంత్ కుడితిపూడి, పవన్ కుర్ర, సుమంత్ కొర్రపాటి, నరేష్ కోనేరు,శివ బత్తల, టిట్టు మద్దిబట్ల, కిషోర్ చలసాని, రావి అమర్ నాథ్ తదితరులు పాల్గొన్నారు.




