న్యూజెర్సీ పర్యటనలో తెలంగాణ భాజపా ఉపాధ్యక్షురాలు మాధవి

🕑 Published: May 25, 2026 at 08:36 AM CST

అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మాధవి కొల్లి న్యూజెర్సీలో పర్యటించారు. ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ-యూఎస్ఏ ఆధ్వర్యంలో ఎడిసన్, న్యూజెర్సీలోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్‌లో ఆమె ప్రవాసులను కలుసుకున్నారు. మాధవి మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో తన అనుభవాలను పంచుకున్నారు. అక్కడ క్షేత్రస్థాయిలో కర్యకర్తలతో కలిసి పనిచేసిన విధానాన్ని వివరిస్తూ, ప్రజలు గత ప్రభుత్వంపై విసుగుచెంది మార్పు కోసం బీజేపీకి అవకాశం ఇచ్చారని తెలిపారు. తెలంగాణలో కూడా ప్రజలు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల పాలనపై నిరాశ చెందారని, రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు స్పష్టమైన మద్దతు ఇస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ-యూఎస్ఏ అధ్యక్షుడు డాక్టర్ అడపా ప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ప్రధాన కార్యదర్శి వాసుదేవ్ పటేల్ మాట్లాడుతూ బీజేపీ క్షేత్రస్థాయిలో బలమైన అనుబంధం కలిగిన పార్టీ అని, రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ-యూఎస్ఏ తెలంగాణ చాప్టర్ కన్వీనర్ విలాస్ రెడ్డి జంబుల మాధవి అమెరికా పర్యటన విశేషాలను వివరించారు. బీజేపీ సంవత్సరాలుగా ఎలా బలోపేతం అయిందో తెలియజేస్తూ, 2028లో తెలంగాణలో కూడా బీజేపీ విజయపథంలో ముందుకు సాగుతుందని అన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త గోవింద్ రాజ్ ఇటీవల మలక్‌పేట్‌కు చెందిన కరుణాకర్ మృతికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కృష్ణారెడ్డి, సంతోష్ రెడ్డి, గుంజన్ మిశ్రా, అమిత్ పాండే, కృష్ణ మోహన్, ప్రసాద్, రాంరెడ్డి వేముల, రాజవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

📲 Join Our WhatsApp Channel
ఆరవ అంతర్జాతీయ శివపదం పోటీవర్జీనియాలో ఘనంగా మినీ మహానాడునెబ్రాస్కాలో వైభవంగా తెలుగు బడి వార్షికోత్సవంకొలంబియా విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో కీలకోపన్యాసం చేసిన సరయు బేతెంచర్లవైభవంగా నెబ్రాస్కా తెలుగు సమితి ఉగాదికాన్సాస్‌లో మురళీమోహన్‌కు స్వర్ణ సత్కారంజీయర్ ట్రస్ట్-నాట్స్‌ల ఆధ్వర్యంలో సీతారామా కళ్యాణంఅనంతవరం వెంకన్న ఆలయ పంచతల రాజగోపురం నిర్మాణానికి తితిదే బోర్డు ఆమోదంఅమెరికా పార్కుల్లో తెలుగు కబుర్లు-TNI ప్రత్యేకంDeepica Mutyala Inspires UT McCombs Graduatesడా. నోరికి తెలుగు కళాసమితి ఉగాది పురస్కారంSaanvi Gullapalli Donates 5000 USD To North Texas FoodBankసింగపూర్‌లో 409వ సారి భాగవత సప్తాహం చేసిన వద్దిపర్తిA HUB GLOBAL Hosts Investor Launch of "Yadadri Hills"ATA Conducts Chess Tournament Successfully in Extonతానా మిడ్ అట్లాంటిక్ ఆధ్వర్యంలో వీలునామాపై అవగాహన సదస్సుడల్లాస్‌లో "అమానా" ఆధ్వర్యంలో ఈద్ మిలాప్ వేడుకలుతెలుగు సింగపూర్ ప్రీమియర్ లీగ్ 2026వరంగల్ రైతు సభను విజయవంతం చేయండి - ఆస్ట్రేలియా ఎన్నారై బిఆర్ఎస్స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ సప్తమ వార్షికోత్సవం
No Previous Next Article