🕑 Published: May 20, 2026 at 08:03 PM CST
జీవితంలో ఎదగడానికి క్రమశిక్షణ, కృషి, సేవాభావం ఎంతో ముఖ్యమని పద్మశ్రీ, సినీనటుడు మురళీ మోహన్ అన్నారు. అందుకే ప్రతిఒక్కరూ స్వీయ క్రమశిక్షణను అలవరచుకోవాలని సూచించారు. అమెరికాలోని కాన్సస్ నగరంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్), తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ కాన్సాస్ సిటీ (టాగ్ కేసి) సంయుక్త ఆధ్వర్యంలో ఆయనకు సువర్ణ సత్కార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా తన జీవితంలో ఎదురైన ఒడిదొడుకులు, తన అనుభవాలను మురళీ మోహన్ వివరించారు. అమెరికాలో పెరుగుతున్న తెలుగు పిల్లలకు మాతృభాష, తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు, జీవన విధానంపై అవగాహన కల్పించడం ఎంతో అవసరమని తెలిపారు. పిల్లల్ని సిలికానాంధ్ర మనబడి కార్యక్రమంలో చేర్పించి తెలుగు భాష నేర్పించాలని, తెలుగు సంస్కృతి మూలాలను భావితరాలకు అందించాలని ప్రవాసాంధ్రులకు పిలుపునిచ్చారు.
మురళీ మోహన్ లోని వ్యాపార నిపుణత, క్రమశిక్షణ, ప్రజాసేవ పట్ల అంకితభావం ఎంతో మందికి స్ఫూర్తినిచ్చాయని నాట్స్ ఛైర్మన్ కిశోర్ కంచర్ల అన్నారు. అలాగే, డాలస్లో జరగనున్న మహాసభలకు అందరినీ ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి నాట్స్ నిర్వహణ మండలి సభ్యులు విజయ్ వర్మ కొండా, మురళీ మోహన్ కుమార్తె మధుబిందు, అల్లుడు తుమ్మల రంగారావుతో ఇతర కుటుంబ సభ్యులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నాట్స్ జాతీయ నాయకులు రవి గుమ్మడిపూడి, వెంకట్ మంత్రి, నాట్స్ కాన్సస్ విభాగ సమన్వయకర్త ప్రసాద్ ఇసుకపల్లి, సంయుక్త సమన్వయకర్త చైతన్య ద్యావనపల్లి పాల్గొన్నారు. టాగ్ కేసి చైర్మన్ సరిత ఏడ్మా, కార్యదర్శి శ్రీనివాసుల రెడ్డి చెవూరు, అధ్యక్షులు మధు గంట, ఉపాధ్యక్షురాలు సరిత రాయన్నగారి, తదితర స్థానిక ప్రముఖులు ఇతర సభ్యులు మురళీ మోహన్ సత్కారంలో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమానికి శ్రీవిద్య ఇసుకపల్లి, సొనాలికా పడాల వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. విశ్వమోహన్ అమ్ముల, నిధి రావు, శ్రీవిద్య ఇసుకపల్లి సంగీత విభావరి ప్రేక్షకులను అలరించింది. అలాగే మంజుల చిట్టెంపల్లి విద్యార్థులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యం, సొనాలికా పడాల మహా నటి ఏకపాత్రాభినయం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
రెండు తెలుగు సంస్థలను ఏకతాటిపైకి తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ఓ మధుర జ్ఞాపకంగా మలచడంలో ముఖ్య భూమిక పోషించిన వెంకట్ మంత్రి, వెంకటేష్ రావు చదలవాడ, సరిత ఏడ్మా, మధు గంటలను పలువురు ప్రత్యేకంగా అభినందించారు. నాట్స్ కార్యవర్గ సభ్యులు శ్రీవిద్య ఇసుకపల్లి, మదన్ సానె, సౌజన్య రావు, సాయిరామ్ గండ్రోతుల, విజయ్ రంగిణి, భారతి రెడ్డి, వేణు గారా, శ్రీనివాస్ దామా, గిరి చుండూరు, శ్రీనివాస్ అబ్బూరి, నాగార్జున రెడ్డి, రమణ కారే, నిఖిల్; అలాగే టాగ్ కేసి నిర్వహణ మండలి సభ్యులు డా. రాజా గోపాల్ రంగినేని, చంద్ర యక్కలి, దివాకర్ చెన్నారెడ్డి, కార్యవర్గ సభ్యులు ఫణికుమార్ కాశిరెడ్డి, సురేష్ తుమ్మల, విజయ్ కొండి, ప్రవల్లిక హేమంత్ వట్టెం, యమున కళువల్పల్లి, అనిత బెల్లంకొండ, దినేష్ రాయబారపు, ఉదయ్ కుమార్ అడుడొడ్ల, గౌతమ్ నల్లూరి, అరవింద్ పెంటపాటి, ఉమాకాంత్ పార్సి, తిరుమల కుమార్ ముద్దన, స్వరూప్ కుండేటి, శ్రీధర్ అమ్మిరెడ్డి, నరేంద్ర దుద్దెల, భార్గవ్, శ్రీనివాస్ పెనుగొండ, పాండు రంగారావు తదితరులు సమిష్టిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సిలికానాంధ్ర మనబడి కాన్సస్ ప్రతినిధులు రత్నేశ్వర్ మర్రె, శ్రీనివాస్ దామా, శ్రీదేవి గొబ్బూరితో పాటు వారి బృందం పాల్గొని మురళీ మోహన్ అభినందించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరికీ రుచికరమైన విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం విజయవంతమయ్యేందుకు సహకరించిన ప్రతిఒక్కరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు
