🕑 Published: May 10, 2026 at 10:57 AM CST
గత మంగళవారం తిరుమల అన్నమయ్య భవన్‌లో టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో గుంటూరు జిల్లాలోని తుళ్ళూరు మండలం అనంతవరంలో ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో రూ.2.71 కోట్లతో పంచతల రాజగోపురం నిర్మాణానికి తితిదే బోర్డు ఆమోదం తెలిపిందని తితిదే బోర్డు సభ్యుడు నన్నపనేని సదాశివరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తితిదే బోర్డు, బీఆర్ నాయుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఈఓ ముద్దాడ రవిచంద్ర, అడిషనల్ ఈవో వెంకయ్యచౌదరి, జేఈఎవో వీరబ్రహ్మం, ఆలయ అభివృద్ధికి సహకారం అందిస్తున్న కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, శాసనసభ్యులు తెనాలి శ్రావణకుమార్‌లకు ధన్యవాదాలు తెలిపారు.

