నిజామాబాద్ నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి నాట్స్ తోడ్పాటు

Featured Image

ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) నిజామాబాద్‌లోని నిర్మలా హృదయ్ హైస్కూల్‌కు ఇంటరాక్టివ్ డిజిటల్ బోర్డులను దానం చేసింది. కొత్త ఇంటరాక్టివ్ బోర్డుల ద్వారా తరగతి గది బోధనను ఆకర్షణీయంగా, దృశ్యపరంగా, విద్యార్థికి పాఠాన్ని సులువుగా అర్థం చేసుకునే వెసులుబాటును కల్పిస్తాయని నాట్స్ అధ్యక్షుడు మందాడి శ్రీహరి అన్నారు. మల్టీమీడియా వివరణలు, యానిమేషన్లు, డైగ్రామ్‌లు, ఇంటరాక్టివ్ కార్యకలాపాలు వంటి వాటిని దీని ద్వారా బోధించనున్నారు. నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, కిరణ్ మందాడి తదితరులు పాల్గొన్నారు. నాట్స్ సంస్థ చొరవకు హైస్కూల్ నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.

Tags-NATS Donates To Nizamabad Nirmal Hruday HighSchool

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles