మైటా ఆధ్వర్యంలో మలేషియాలో బతుకమ్మ సంబరాలు

Featured Image

మలేషియా తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో 12వ వార్షికోత్సవ బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథి గా హాజరైన ఇండియన్ హై కమీషనర్, కౌలలంపూర్ బి.ఎన్. రెడ్డి గత పన్నెండు సంవత్సరాలుగా మైటా చేస్తున్న సహకార కార్యక్రమాలను మరియు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తూ నిర్వహిస్తున్న పండుగలను కార్యక్రమాలను అభినందించారు. సరిహద్దులు దాటి వచ్చినా కూడా మన సాంప్రదాయాన్ని ఇంత పెద్దఎత్తున 150 పైగా బతుకమ్మలు మరియు 2000 పైచిలుకు సమూహంతో చిన్నపాటి తెలంగాణను తలపిస్తుంది అని కొనియాడారు. అతిథిగా హాజరైన తెలంగాణ ఎంఎల్సీ మహేందర్ రెడ్డి మైటా చేస్తున్న కార్యక్రమాలకు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమానికి మాజీ ఆసియా పసిఫిక్ సుందరి రష్మి ఠాకూర్ హాజరయ్యారు.

తెలంగాణ జానపద గాయని నాగలక్ష్మి తన పాటలతో అలరించారు. డాన్స్ మాస్టర్ నరేష్ ఆధ్వర్యంలో చిన్నారులు మరియు మహిళలు తెలంగాణ జానపద పాటలకు చేసిన నృత్యప్రదర్శన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. 12వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మైటా ఆధ్వర్యంలో కౌలలంపూర్ లో నూతనంగా ఒక ఆలయ నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రకటించారు. త్వరలో పూర్తివివరాలను తెలియజేస్తామని చెప్పారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా ప్రెసిడెంట్ సైదం తిరుపతి, వైస్ ప్రెసిడెంట్ చిరుత చిట్టిబాబు , మహిళా ప్రెసిడెంట్ కిరణ్మయి, జనరల్ సెక్రటరీ సందీప్ గౌడ్, జాయింట్ సెక్రటరీ సత్యనారాయణరావు, ట్రేజరర్ సందీప్ కుమార్ లగిశెట్టి, జాయింట్ ట్రేజరర్ సుందర్ రెడ్డి, యూత్ ప్రెసిడెంట్ సంతోష్ దాసరాజు, యూత్ వైస్ ప్రసిడెంట్ శివ తేజ, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ మారుతి, హరి ప్రసాద్, రాములు, రమేష్, మహేష్ మార్త, మధు , జీవన్ రెడ్డి, వినోద్, రఘుపాల్ రెడ్డి, రంజిత్ రెడ్డి, జ్యోతి నాంపల్లి, సుప్రియ కంటే, పూర్ణ, అనిల్ రావు, హరీష్, శశి, అడ్వైసరీ మెంబర్స్ గురిజాల అమర్నాథ్ గౌడ్, సుధీర్, మన్సూర్ అహ్మద్, వేణుగోపాల్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

Tags-MYTA Malaysia 12th Annual Batukamma

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles