కొలువుదీరిన ఆటా 2025 నూతన కార్యవర్గం. అధ్యక్షుడిగా జయంత్ చల్లా.

Featured Image

అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) నూతన అధ్యక్షుడిగా జయంత్ చల్ల జనవరిలో మాజీ అధ్యక్షురాలు బొమ్మినేని మధు నుండి బాధ్యతలు స్వీకరించారు. అధ్యక్షుడు జయంత్ చల్ల మాట్లాడుతూ, ఆటా సంస్థలో సేవా, సాంస్కృతిక, విద్యా, సామాజిక కార్యక్రమాలను ప్రోత్సహించడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. ముఖ్యంగా యువతరాన్ని భాగస్వామ్యం చేయడం, ఆటా కార్యక్రమాలను విస్తరించడం, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రోత్సాహం అందించడం తమ ప్రాధాన్య కార్యక్రమాలుగా పేర్కొన్నారు.

2025-26కు సతీష్ రెడ్డి తదుపరి అధ్యక్షుడిగా, సాయినాథ్ బోయపల్లి కార్యదర్శిగా, శ్రీకాంత్ రెడ్డి గుడిపాటి కోశాధికారిగా, శారద సింగిరెడ్డి సంయుక్త కార్యదర్శిగా, విజయ్ రెడ్డి తూపల్లి సంయుక్త కోశాధికారిగా, కార్య నిర్వాహక దర్శకుడిగా నర్సిరెడ్డి గడ్డికొప్పుల, కార్యనిర్వాహక కమిటీ సలహాదారునిగా అరవింద్ రెడ్డి ముప్పిడిలు వ్యవహరిస్తారు. 2024 డిసెంబర్ లో నిర్వహించిన ఎన్నికల్లో గెలుపొందిన BOT సభ్యులు 2025-28 వరకు పదవిలో కొనసాగనున్నారు. రామిరెడ్డి వెంకటేశ్వర(ఆర్.వి రెడ్ది, శ్రీధర్ కాంచనకుంట్ల,సుధీర్ బండారు, విజయ్ కుందూర్, విష్ణు మాధవరం, సంతోష్ రెడ్డి కోరం, శ్రీధర్ తిరుపతి, శ్రీనివాస్ శ్రీరామ, విజయ్ రెడ్డి తూపల్లి, రవీందర్ కె రెడ్డి, శారద సింగిరెడ్డి, వెంకట్ (వెన్) రెడ్డి రావి, కాశివిశ్వనాథ్ రెడ్డి కొత్త, రాం మట్టపల్లి, శ్రీధర్ బాణాల పాలక మండలి సభ్యులుగా ఎన్నికయ్యారు. వీరు ప్రమాణస్వీకారం చేశారు.

Tags-ATA 2025 New Executive Committee.

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles