నాట్స్ సంబరాల్లో సినీప్రముఖుల సందడి

Featured Image

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం టంపాలో జులై 4,5,6 తేదీల్లో నిర్వహిస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్శ్) 8వ అమెరికా తెలుగు సంబరాల్లో పలువురు సినీ ప్రముఖులు సందడి చేయనున్నారు. దర్శకులు కె. రాఘవేంద్రరావు, సుకుమార్, గోపిచంద్ మలినేని, హరీశ్ శంకర్, మెహర్ రమేశ్‌, సినీ గేయరచయితలు చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి, త్రిపురనేని కల్యాణ్ చక్రవర్తిలు పాల్గొంటారని నాట్స్ ఒక ప్రకటనలో తెలిపింది.

కళా, సినీ, సాహితీ కార్యక్రమాలతో నాట్స్ సంబరాల్లో ప్రవాసులకు పసందైన తెలుగు వినోదం పంచుతామని సమన్వయకర్త గుత్తికొండ శ్రీనివాస్ తెలిపారు. ప్రవాసులు ఈ వేడుకల్లో పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నాట్స్ ఛైర్మన్ పిన్నమనేని ప్రశాంత్, అధ్యక్షుడు మదన్ పాములపాటి, తదుపరి అధ్యక్షుడు మందాడి శ్రీహరి, సంబరాల కార్యదర్శి మల్లాది శ్రీనివాస్‌లు కోరారు.

Tags-Tollywood Celebrities at NATS 8th Sambaralu Florida, NATS 8th ATS Tampa Telugu July

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles