సెయింట్ లూయిస్‌లో నాట్స్ ఉచిత వైద్యశిబిరం

Featured Image

మిస్సోరీలో సెయింట్ లూయిస్‌లో నాట్స్ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది. స్థానిక మహాత్మగాంధీ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ బాపూజీ దర్శి(ఇంటర్నల్ మెడిసిన్), డాక్టర్ శేఖర్ వంగల(సైకియాట్రిస్ట్) రోగులకు వైద్య సేవలు అందించారు.

రోగులను పరిశీలించిన వైద్యులు, వారికి అవసరమైన పలు రకాల వైద్య పరీక్షలను కూడా నిర్వహించారు. సమాజ సేవలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి సహకరించిన వాలంటీర్లకు, నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లకు నాట్స్ మిస్సోరీ చాప్టర్ కోఆర్డినేటర్ సందీప్ కొల్లిపర ధన్యవాదాలు తెలిపారు. మిస్సోరీ నాట్స్ ప్రతినిధులను నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల, నాట్స్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి ప్రత్యేకంగా అభినందించారు.

Tags-NATS Saint Louis Conducts Free Medical Camp

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles