ఆటా న్యూజెర్సీ ఆధ్వర్యంలో 'ధరిత్రి దినోత్సవం'

Featured Image

అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) – న్యూజెర్సీ విభాగం ఆధ్వర్యంలో, సౌత్ బ్రున్స్విక్ టౌన్‌షిప్‌లో 'ప్రపంచ ధరిత్రి దినోత్సవం' (Earth Day) నిర్వహించారు. ఓజోన్ పొర క్షీణించడం, పర్యావరణాన్ని కాపాడుకోవల్సిన ఆవశ్యకత, వ్యక్తిగత శుభ్రతే కాకుండా పరిసరాల శుభ్రతపై నిర్వాహకులు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరు తమ వంతు కృషిగా మొక్కలను నాటడం అలవాటు చేసుకోవాలి కోరారు.

న్యూజెర్సీ రీజినల్ కోఆర్డినేటర్లు కృష్ణమోహన్ మూలే, ప్రదీప్ కట్టా, ప్రసాద్ ఆకుల, ఉమన్ రీజినల్ చైర్ గీతా రెడ్డి, యూత్ టీమ్ నుండి ఇషిత మూలే, రిషిత జంబుల, దీక్ష కట్ట, ఇషాని కోరం, షణ్ముఖప్రియ మూలే తదితరులు పాల్గొన్నారు. ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా, ప్రెసిడెంట్ ఎలెక్ట్ సతీష్ రామసహాయం, ట్రెజరర్ శ్రీకాంత్ గుడిపాటి, బోర్డు అఫ్ ట్రస్టీ సభ్యులు శ్రీనివాస్ దర్గుల, వినోద్ కోడూరు, సంతోష్ రెడ్డి కోరం, విజయ్ కుందూరు మరియు ఆటా సీనియర్ నాయకులు డా. పరశురామ్ పిన్నపురెడ్డి, శరత్ వేముల, రఘువీర్ రెడ్డి, రవీందర్ గూడూరు, విజయ్ గోలి, రమేష్ మాగంటి, రవి పెద్ది, మెంబర్‌షిప్ చైర్ శ్రీకాంత్ తుమ్మల, రీజినల్ డైరెక్టర్ విలాస్ రెడ్డి జంబులలకు ఆటా-న్యూజెర్సీ ధన్యవాదాలు తెలిపింది.

Tags-ATA NJ Earth Day 2025

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles