కాన్సాస్ సిటీలో వైభవంగా TAGKC ఉగాది

Featured Image

తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ కాన్సాస్ సిటీ (TAGKC) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఆదివారం నాడు స్థానిక ఓలేత నార్త్ వెస్ట్ హై స్కూల్ లో ఘనంగా నిర్వహించారు. ప్రోగ్రాం కమిటీ చైర్ యామిని వల్లేరు సభికులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పూజారి శ్రీనివాసాచార్యులు పంచాంగ శ్రవణం చేశారు. బోర్డు ఆఫ్ ట్రస్టీస్ చైర్ శ్రీని పెనుగొండ నూతన బోర్డును సభకు పరిచయం చేశారు. ప్రెసిడెంట్ శ్రావణి మేక నూతన కార్యవర్గాన్ని పరిచయం చేశారు.

ఉషా సాహ, అభిరుచి సింగ్, కళై పద్మనాభన్ ను బోర్డు సభ్యులు సరితా ఎడ్మ, దీప్తి వొడ్నాల, శ్రావణి మేకలు సన్మానించారు. ఆర్ట్స్, చెస్, పికిల్ బాల్ పోటీల్లో విజేతలకు బహుమతులను స్పోర్ట్స్ చైర్ సురేష్ తుమ్మల, బోర్డు సభ్యులు అభిరాం దువ్వూరిలు అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కూచిపూడి, భారతనాట్యం, సినిమా డాన్సులతో పిల్లలు, పెద్దలు అలరించారు. దీప్తి యాయవరం వ్యాఖ్యాతగా వ్యవహరించారు. కమిటీ వైస్ ప్రెసిడెంట్ మధు గంట కార్యక్రమాన్ని ధన్యవాదాలు తెలిపారు. ఫుడ్ కమిటీ చైర్ ఉమాకాంత్ పార్శి సమన్వయంలో అచ్చ తెలుగు భోజనం ఏర్పాటు చేశారు.

Tags-TAGKC Kansas City Telugu Ugadi 2025

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles