నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు

Featured Image

నార్త్ కరోలినాలోని మోరిస్‌విల్‌లో ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) బాలల సంబరాలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు గణితం, చిత్రకళ, వక్తృత్వం, నాట్యం(శాస్త్రీయం, జానపద, మూవీ), గాత్రం, వాద్య సంగీతం వంటి పలు విభాగాల్లో పోటీలు ఏర్పాటు చేసి విజేతలకు బహుమతులను అందజేశారు.

నాట్స్ సహ వ్యవస్థాపకులు డాక్టర్ మధు కొర్రపాటి, వేక్ కౌంటీ షెరీఫ్ విల్లే రోవి, స్థానిక పోలీస్ కెప్టెన్ రాబర్ట్ కారె, ప్రముఖ వైద్యులు డాక్టర్ రామ గరిమెళ్ల, శంకర్ అడుసుమిల్ల, డాక్టర్ పవన్ యర్రంశెట్టి తదితరులు పాల్గొని చిన్నారుల ప్రతిభను అభినందించారు. నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ వెంకటరావు దగ్గుబాటి, నార్త్ కరోలినా చాప్టర్ కోఆర్డినేటర్ ఉమా శంకర్ నార్నె, జాయింట్ కోఆర్డినేటర్ దీపికా సయ్యపురాజు, వెబ్-మీడియా సమన్వయకర్త రాజేశ్ మన్నేపల్లి, ట్రెజరర్ వేణు వెల్లంకి, ఈవెంట్స్ చైర్ కల్పన అధికారి, ఈవెంట్స్ కోచైర్ భాను నిజాంపట్నం, స్పోర్ట్స్ చైర్ రవితేజ కాజా, మహిళా సాధికారత సమన్వయకర్త యశస్వినీ పాలేరులు ఈ బాలల సంబరాలను దిగ్విజయం చేయడంలో కీలక పాత్ర పోషించారు. నార్త్ కరోలినా విభాగాన్ని నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, అధ్యక్షుడు శ్రీహరి మందాడిలు అభినందించారు.

Tags-NATS North Carolina Baalala Sambaralu 2025

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles