డల్లాస్‌లో "అమానా" ఆధ్వర్యంలో ఈద్ మిలాప్ వేడుకలు

🕑 Published: May 03, 2026 at 04:47 PM CST

ఆంధ్రప్రదేశ్ ముస్లిం అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(AMANA) టెక్సాస్ విభాగం ఆధ్వర్యంలో డల్లాస్ పరిసర ప్రాంతమైన ప్లేనోలో ఈద్ మిలాప్ వేడుకలు నిర్వహించారు. అమానా టెక్సాస్ చాప్టర్ అధ్యక్షుడు మస్తాన్ షేక్, ఉపాధ్యక్షుడు అర్ఫీ సిద్దిఖీ నాయకత్వంలో ఈ వేడుకలు ఏర్పాటు చేశారు. ఖురాన్ పారాయణతో వేడుక ప్రారంభించారు. స్థానిక చిన్నారులు జోహా మొహమ్మద్, రెహాన్ షేక్ అనువాదం అందించారు. డాక్టర్ అంజుమ్ వ్యాఖ్యాతగా కార్యక్రమాన్ని నడిపించారు. "అమానా" ఉత్తర అమెరికావ్యాప్తంగా 11 విభాగాలతో ఎదిగిన స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని నిర్వాహకులు వివరించారు. అమానా గ్లోబల్ ఫౌండేషన్ అధ్యక్షుడు అబ్దుల్ ఖుద్దూస్ అమానా లక్ష్యాలు, అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్‌లో అమానా చేపడుతున్న సేవా కార్యక్రమాల గురించి ప్రసంగించారు.

BOD చైర్ డాక్టర్ అబ్దుల్ రహీమాన్ అమానా మార్గదర్శక సూత్రాల గురించి వివరించారు. ఇతర సంస్థలతో కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని, పరస్పర సంబంధాలను బలపరచాల్సిన ప్రాముఖ్యతను, ముస్లింలపై ఏర్పడుతున్న ప్రతికూల భావజాలాలను సానుకూలంగా ఎదుర్కోవాల్సిన బాధ్యతను ప్రస్తావించారు.

BOT చైర్ మొహమ్మద్ ఇక్బాల్ ఈద్ మిలాప్ సందేశాన్ని అందించారు. అనంతరం పలువురు స్థానిక ప్రముఖులకు, మీడియా ప్రతినిధులకు అవార్డులను ప్రదానం చేశారు. 100వ స్పెల్లింగ్ బీ చాంపియన్ ఫైజాన్ జాకీ సత్కరించారు. ఈ చాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న తొలి ముస్లిం బాలుడిగా అతను సాధించిన చారిత్రాత్మక విజయాన్ని కొనియాడారు. అబ్దుల్ హమీద్ సేవలకు గుర్తింపుగా Volunteer Excellence Awardతో సత్కరించారు.

IANT అధ్యక్షుడు మహేందర్ ఘనపురం, IANT ప్రెసిడెంట్-ఎలెక్ట్ దీపక్ కల్రా, TPAD నుండి వేణు భాగ్యనగరి, Rahbar Foundation నుండి అజహర్ పాషా, ESCO నుండి ఖుద్రతుల్లా అల్వీ, ఇషాక్ అహ్మద్, NASIM Foundation నుండి మజాహిర్ సయ్యద్, అహ్మద్ ఖాద్రీ, TANTEX నుండి మాధవి లోకిరెడ్డి, Radio Surabhi నుండి రాజేశ్వరి ఉదయగిరి, Radio Sangam నుండి పృథ్వి బల్లా, Dallas Area Rayalaseema Association నుండి వీరశివరెడ్డి, సిలికానాంధ్ర నుండి భాస్కర్ రాయవరం తదితరులు పాల్గొన్నారు.

కార్యక్రమ నిర్వహణలో మస్తాన్ షేక్, అర్ఫీ సిద్దిఖీ, జకీర్ షేక్, షాజహాన్ షేక్, సాబీర్ మహమ్మద్, రుమాన్ ఖాన్, అబ్దుల్ మజీద్, ఇంతియాజ్ అహ్మద్, జమీర్‌ఉద్దీన్ మొహమ్మద్, ఖాజా షేక్, సలీమ్ జిలానీ, ఖాదర్ షేక్, కలీం సయ్యద్, యూనుస్ ఖాన్ తదితరులు సహకరించారు. ఉత్తర అమెరికాలో నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముస్లిం కుటుంబాల సామాజిక, సాంస్కృతిక అవసరాలను తీర్చడానికి స్థాపించబడిన లాభాపేక్షలేని సంస్థ - అమానా. ఆంధ్రప్రదేశ్‌లో ముస్లిం సమాజ అభ్యున్నతి కోసం పలు సేవా కార్యక్రమాలకు అమానా నిర్వహిస్తోంది.

📲 Join Our WhatsApp Channel
తెలుగు సింగపూర్ ప్రీమియర్ లీగ్ 2026వరంగల్ రైతు సభను విజయవంతం చేయండి - ఆస్ట్రేలియా ఎన్నారై బిఆర్ఎస్స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ సప్తమ వార్షికోత్సవంవేడుకగా సెయింట్ మార్టినస్ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంటెక్సాస్ తెలుగు ఐటీ కంపెనీల్లో హెచ్-1బీ అవకతవకలపై అటార్నీ జనరల్ దర్యాప్తుఅమెరికాలో ఇరువురు తెలుగు వ్యక్తులు మృతితానా ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవంఐర్లాండ్‌లో వాసవీ అమ్మవారి జన్మదినోత్సవంTable Tennis Tournament By ATA Delaware Valleyలండన్‌లో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలుప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తోడ్పడండిసింగపూర్ ప్రవాసులతో మంత్రి సత్యకుమార్ భేటీCAA ఆధ్వర్యంలో చికాగోలో వైభవంగా సీతారామ కళ్యాణంఆటా 19వ మహాసభల నిధుల సేకరణకు డాలస్‌లో విశేష స్పందనATA 19th Convention Fundriser In New Jersey Rises 625K USDఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నారైల ఆసక్తి-కోమటి జయరాంన్యూయార్క్‌లో పంచెకట్టు ఫ్యాషన్ షో అదరహో!వర్జీనియాలో మైనర్లపై లైంగిక వేధింపులు...తెలుగు వ్యక్తికి 20ఏళ్ల జైలుశిక్షజర్మనీలో చంద్రబాబు జన్మదినోత్సవం..పాల్గొన్న మంత్రి భరత్నేడు వర్జీనియాలో కోమటి జయరాం పర్యటన
No Previous Next Article