🕑 Published: May 06, 2026 at 03:53 PM CST
న్యూజెర్సీలో తెలుగు కళాసమితి ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు, పురస్కారాల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా పద్మభూషణ్ అవార్డు గ్రహీత డా.నోరి దత్తాత్రేయుడు, ఉపేంద్ర చివుకుల, గుంటూరు మిర్చియార్డు మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు, సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్ విచ్చేశారు. తెలుగు కళాసమితి అధ్యక్షుడు మధుసూధనరావు అన్నా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
నోరి దత్తాత్రేయుడు మాట్లాడుతూ.. భాషే సాంస్కృతిక వారధి అని అన్నారు. ఒక జాతి అస్తిత్వం, ప్రత్యేకతను చాటిచెప్పేది మాతృభాషేనని తెలిపారు. తెలుగువారి సమక్షంలో ఈ ఉగాది పురస్కారం అందుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చిందన్నారు. 2026-28కి అధ్యక్షురాలిగా ఎన్నికైన ఉమా మాఖం, 8 మంది కార్యవర్గ సభ్యులతో సుధాకర్ ఉప్పల ప్రమాణ స్వీకారం చేయించారు.

