🕑 Published: August 10, 2026 at 10:09 AM CST
ప్యారిస్ నగరంలోని ప్రసిద్ధ ఐఫిల్ టవర్ వద్ద ఫ్రాన్స్ దేశ ఎన్నారై తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణ, పార్టీని విదేశాల్లో మరింత బలోపేతం చేయడం, సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి ప్రభుత్వ విజయాలను తీసుకువెళ్లడం తదితర అంశాలపై చర్చించారు. ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం వేలాది మంది అభ్యర్థులు కష్టపడి చదివి, పోటీ పరీక్షల్లో పాల్గొని, తమ ప్రతిభతో ఉద్యోగాలను సాధించారని ఆయన గుర్తుచేశారు. ఎంపికైన అభ్యర్థులపై అనవసర ఆరోపణలు చేయడం, నియామకాల్లో అక్రమాలు జరిగాయని నిరాధార ప్రచారం చేయడం ద్వారా వారి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడం మంచిది కాదన్నారు. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అత్యంత వైభవోపేతంగా ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించడం అభినందనీయమని అన్నారు.
ప్రవాసాంధ్రుల సమస్యలను పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై NRIలలో అవగాహన కల్పించాలని సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో మహేష్ గనుపూరు, సంతోష్ పిల్లా, పవన్ కుమార్ మాచా, పురంధర్ చౌదరి వేమూరి, హేమంత్ గెల్లి, వేదవ్యాస్ పువ్వాడ, చరణ్ చౌదరి దబ్బారా, తరుణ్ తేజ యారం, హనుమాన్ చౌదరి పరిటాల, చరిత్ వంశీ గంట, మణికంఠ అమరేశ్వరపు, నన్నపనేని హరికిరణ్ చౌదరి, గోపి చందు పల్లపు, అరక్షి ఆకాశ్ కొల్లి, గోల్డెన్ బాబు మువ్వ, మణికంఠ యెమినేని, అభినవ్ చౌదరి వెలివెల్లి, రామకాంత్ ఆదిగొప్పుల, భువన చంద్ర మోర్ల తదితరులు పాల్గొన్నారు.

