న్యూయార్క్‌లో వైభవంగా NYTTA బోనాల జాతర

🕑 Published: July 30, 2026 at 11:50 PM CST

న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (NYTTA) ఆధ్వర్యంలో బోనాల జాతర వైభవంగా నిర్వహించారు. స్థానిక ఐసెన్ హోవర్ పార్క్ లో నిర్వహించిన ఈ వేడుకలు ప్రవాస తెలుగు కుటుంబాలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి నైటా అధ్యక్షుడు రవీందర్ కోడెల అధ్యక్షత వహించగా, కార్యవర్గమంతా ఉత్సాహంగా ఏర్పాట్లుచేసి విజయవంతం చేశారు. తెలంగాణ జానపద కళని ప్రతిబింబించేలా ప్రముఖ గాయకుడు రసమయి బాలకిషన్, సినీ గేయరచయిత కాసర్ల శ్యామ్, జానపద కళాకారుడు నల్లగొండ గద్దర్, రచయిత గాయకుడు మిట్టపల్లి సురేందర్, ప్రముఖ ఫోక్ సింగర్ సంధ్య యాట లు తమ అద్భుత ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. ఆట పాటలతో కార్యక్రమం అధ్యంతం సందడే సందడి.

ఆశోక్ చింతకుంట పోతురాజు ప్రదర్శన, పద్మ కోడెల తయారుచేసిన అమ్మవారి అలంకరణ, మహంకాళి గుడి, బోనాల తయారీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ బోనాల వేడుకల్లో డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి దంపతులు, నైటా కార్యవర్గ సభ్యులు, బోర్డు ఆఫ్ డైరెక్టర్లు, పెద్ద సంఖ్యలో తెలుగు ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యులు పాల్గొని బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో, జరుపుకున్నారు.

ఈ సందర్భంగా నైటా అధ్యక్షుడు రవీందర్ కోడెల మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు చేరవేయడంతో పాటు విదేశాల్లో నివసిస్తున్న తెలుగు వారికి తమ మూలాలను గుర్తు చేసే వేదికగా నైటా నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రవాస భారతీయుల్లో ఐక్యత, అనుబంధం మరింత బలపడుతుందని పేర్కొన్నారు. వైస్ ప్రెసిడెంట్ హరిచరణ్ బొబ్బిలి, కార్యదర్శి మహేష్ దోమల, కోశాధికారి డా. సౌమ్య చిట్టారి, నైటా కార్యవర్గ సభ్యులు, చైర్మన్ డా.రాజేందర్ రెడ్డి జిన్నా, వైస్ చైర్మన్, లక్సమణ్ ఏనుగు, బోర్డు ఆఫ్ డైరెక్టర్లు, సలహా కమిటీ సభ్యులు, దాతలు పాల్గొన్నారు.

📲 Join Our WhatsApp Channel
నాట్స్ డల్లాస్ చాప్టర్ నూతన కార్యవర్గం ఇదేలండన్‌లో ఘనంగా టాక్ బోనాల జాతరATA Conducts Fun Filled Golf Tournament in Virginiaఇతర భాషల్లోకి సుశ్రుత సంహితను అనువదించాలిడెట్రాయిట్ ప్రవాసులను అలరించిన విష్ణు కళ్యాణం నృత్యరూపకంమలేషియాలో కేటీఆర్ జన్మదిన వేడుకలుడల్లాస్‌లో జగన్ 2.0 సూపర్ యాప్ ఆవిష్కరణబెల్జియంలో 54వ ఎన్నారై బీఆర్ఎస్ శాఖ ప్రారంభంబాయ్స్ నేషన్ ఉపాధ్యక్షుడిగా క్రిష్ కొర్రపాటిHTSL: వైభవంగా ముగిసిన నవకుండాత్మక శతచండీ సహిత రుద్రయాగంఆస్ట్రేలియాలో కేటీఆర్ జన్మదిన వేడుకలుకాలిఫోర్నియాలో పర్యటించిన మంత్రి సీతక్కజీవితంలో ఒత్తిడి సమన్వయంపై టాంపాలో నాట్స్ సదస్సుశుక్రవారం డల్లాస్ పర్యటనకు తితిదే మాజీ ఈవో ధర్మారెడ్డిఆస్ట్రేలియాలో ఎన్నారై బీఆర్ఎస్ 12వ వార్షికోత్సవ వేడుకలుDay5-HTSL: వేల మంది భక్తుల సమక్షంలో సహస్ర కమలార్చనDay4-HTSL: శతచండీ సహిత రుద్రయాగంలో సహస్ర కుంకుమార్చనఆగష్టు 1న సిలికానాంధ్ర రజతోత్సవం. మూడు గిన్నీస్ రికార్డు లక్ష్యంగా ఏర్పాట్లు.ఒకే టొర్నీలో మూడు పతకాలు..అట్లాంటా తెలుగు బాలిక ప్రతిభఅరుణ-చండీ-రాజశ్యామల హోమాలతో మూడో రోజు ఆధ్యాత్మిక వైభవం
No Previous Next Article