🕑 Published: August 04, 2026 at 12:56 AM CST
2029లో ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రవాసాంధులు పనిచేయాలని జర్మనీలోని టీడీపీ ఎన్నారై పిలుపినిచ్చింది. తామూ అదే లక్ష్యంతో పని చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుంటున్నట్టు తెలిపారు. జర్మనీలోని నార్త్ రైన్–వెస్ట్‌ఫేలియా రాష్ట్ర ఎన్‌ఆర్‌ఐ టీడీపీ సమావేశం డ్యూసెల్డార్ఫ్‌లో నిర్వహించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతుందని ఎన్నారై టిడిపి నేతలు అభిప్రాయపడ్డారు. అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పురోగతి, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధిని ప్రశంసించారు. గత రెండేళ్లుగా రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్న నేపథ్యంలో ఎన్నారైలు కూడా ఈ యజ్ఞంలో భాగస్వాములు కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కిషోర్ నల్లపాటి, డా. దీప కందుల, లక్ష్మీపతి మద్దిపట్ల, శ్రీ కృష్ణుడు నాగండ్ల, రామకృష్ణ కొమడూరి, అశోక్‌బాబు దాసరి, శ్రీకాంత్ ఎర్రగుంట, సురేష్ గుడివాడ, స్వప్న, రఘుకుమారి, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి సుమంత్ కొర్రపాటి, ఫర్హత్ మిర్జా, దినేష్ కోవి, లోకేష్, వంశీ హాజరుకాగా, మ్యూనిక్ నుంచి నరేష్ కోనేరు పాల్గొన్నారు.