🕑 Published: August 01, 2026 at 12:51 AM CST
అమెరికాలోని వర్జీనియాలో ప్రవాస భారతీయులు, వారి తల్లిదండ్రుల సమక్షంలో అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం కార్యక్రమం తానా-పాఠశాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ గ్రంధాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల చైర్మన్ మాగులూరి భానుప్రకాష్ సమన్వయపరచారు.
కోటేశ్వరరావు మాట్లాడుతూ స్నేహ బంధం అమూల్యం. పెద్దల స్నేహ బంధం ఇలాగే కొనసాగాలని అరవైల్లో నలుగురు ఆప్తులే మనకున్న నిజమైన ఆస్తి అన్నారు. తానా-పాఠశాల చైర్మన్ భాను మాగులూరి స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
పాల్గొన్న ప్రవాసులు తమ జీవితాలలో స్నేహితుల పాత్ర, కష్టనష్టాలలో స్నేహం విలువ, ఒకరినొకరు గౌరవిస్తూ జీవితకాలం అండగా నిలిచిన మిత్రులను, సందర్భాలనూ నెమరవేసుకున్నారు. అందరూ తమ జీవిత స్నేహ అనుభవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో సీతారామారావు ఎండూరు , శ్రావ్య చామర్తి, శ్రీకాకుల రామ సత్యనారాయణ, వల్లభనేని వీరభద్రరావు, చంద్రనాధ్ నంబూరు, కందుల అభిరామ్, శంకర్రావు పొన్నం, పూర్ణచంద్రరావు అన్నం,కరణం రాజా, అంకమ్మరావు కట్ల, రాధాకృష్ణ మైనేని, సుబ్బారెడ్డి జొన్నల, ఐతా భిక్షపతి, సూరేపల్లి బ్రహ్మం, మేకల రామి రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, సి.హెచ్ సత్యనారాయణ, ఆళ్ళ హరిబాబు, చిట్టెల సుబ్బారావు, రామకృష్ణ రెడ్డి, గణపతిరెడ్డి గుడిపాటి , జంపాల కృష్ణ మోహన్, డాక్టర్ అల్లం లింగం, సురేష్ లగిశెట్టి, యోగానంద్ వంకిన, గంగారావు పొనగోటి , సుదర్శన్ అమరవాది, భాస్కరరావు చీటి, సత్తయ్య మారిశెట్టి, గుడిపాటి గణేష్ రెడ్డి, చెరుకూరి ఇందుశేఖర్, షేక్ నూరి, పులిపాటి రాజేంద్ర ప్రసాద్, చింతా రాంబాబు, ప్రభు, పి.నర్సింగ రావు, శ్రీనివాస్ చేరుకుతోట, వెంకటేశ్వర్రావు చెరుగుప్పం, యాదగిరి గుండా తదితరులు పాల్గొన్నారు.
