సింగపూర్‌లో TCSS ఆధ్వర్యంలో ఘనంగా బోనాల జాతర

🕑 Published: August 10, 2026 at 10:38 AM CST

తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో బోనాల పండుగ ఆదివారం నాడు స్థానిక సుంగే కేడుట్‌ లోని శ్రీ అరసకేసరి శివాలయంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ బోనాల ఊరేగింపులో పోతురాజులు, పులి వేషాలు, తొట్టెలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకల్లో సింగపూర్‌లోని తెలుగువారు పాల్గొన్నారు. బోనాల ఊరేగింపులో అమ్మ వారి పాటలకు అందరూ కలిసి ఆడిపాడారు. తెలంగాణ మహిళలు భక్తి శ్రద్ధలతో దుర్గాదేవికి బోనాలు సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ప్రజలందరికి మహంకాళి ఆశీస్సులు ఉండాలని టీసీఎస్‌ఎస్‌ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. బోనాల జాతరలో నేరెళ్ల శ్రీనాథ్, గౌడ సాయి కుమార్, అయిట్ల లక్ష్మణ్, లక్ష్మిపతి, అరవింద్‌లు పోతురాజు పులివేషాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

బోనాలు పండుగలో పాల్గొన్న భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. సొసైటీ అధ్యక్షుడు నల్ల భాస్కర్ గుప్త, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కోశాధికారి శెశిధర్ రెడ్డి ఎర్రమరెడ్డి, ఉపాధ్యక్షులు బసిక ప్రశాంత్ రెడ్డి, జూలూరి సంతోష్ కుమార్, మిర్యాల సునీత రెడ్డి, సంతోష్ వర్మ మాదారపు, విక్రమ్ చిట్ల, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాసరావు, ప్రాంతీయ కార్యదర్శులు నంగునూరి వెంకట రమణ, నడికట్ల భాస్కర్, మహేష్ చెట్టిపెల్లి, కల్వ లక్ష్మణ్ రాజు, శివ ప్రసాద్ ఆవుల, కార్యవర్గ సభ్యులు బొడ్ల రోజా రమణి, రవి కృష్ణ విజ్జాపూర్, పెరుకు శివ రామ్ ప్రసాద్, విజయ మోహన్ వెంగళ, సతీష్ పెసరు, చల్లా క్రిష్ణ, మణికంఠ రెడ్డి, భాస్కర్ రావు పులిగిళ్ల, ప్రవీణ్ మామిడాల, తోట రాజేంద్ర ప్రసాద్, యసరావేణి విజయ కుమార్, మల్లారెడ్డి కల్లెం, సుకేందర్ నీలం, రమేష్ గడప, అలేఖ్య దార, అలేఖ్య తడిసిన, దీపా రెడ్డి మండల, బోయిని స్వరూప, శ్వేత కుంభం, బర్ల అరుణ్‌కుమార్, బైలపూడి గౌరీ వరలక్ష్మి, మోతె శ్రీనివాస రెడ్డి, బొందుగుల ఉమారాణి, అన్ను సుజాత తదితరులు పాల్గొన్నారు.

📲 Join Our WhatsApp Channel
Paris-France: ఐఫిల్ టవర్ వద్ద ఎన్నారై తెదేపా సమావేశంమలేషియాలో ఘనంగా MYTA బోనాలుCalifornia: AHUB Global Presents Its Vision To Bhattiబే-ఏరియా ప్రవాసులను నిరాశపరిచిన భట్టిRecap: తెలుగు వైభవానికి పట్టం కట్టిన ఆటా 19వ మహాసభలుఆలోచనే సిలికానాంధ్ర ఆయుధం - TNI ప్రత్యేకంTCSS సింగపూర్ అధ్యక్షుడిగా నల్ల భాస్కర్ గుప్తమిషిగన్‌లో రుక్మిణి కల్యాణం2029లో టీడీపీ విజయమే లక్ష్యం-జర్మనీ ఎన్నారై తెదేపాఎస్.జానకికి డల్లాస్ అభిమానుల సంగీత నివాళిన్యూజెర్సీలో పర్యటించిన తెభాజపా అధ్యక్షుడు రామచందర్‌రావుసిలికానాంధ్ర సిగలో మరో మూడు గిన్నీస్ రికార్డులుహైదరాబాద్‌లో ₹20 కోట్లతో ఎన్‌ఆర్‌ఐ భవన్-ఆటా వేడుకల్లో మంత్రి జూపల్లివైవిధ్యంగా సిలికానాంధ్ర దాతల అభినందన సభతానా-పాఠశాల ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవంఅట్టహాసంగా ఆరంభమైన "ఆటా"19వ ఆటా సభలకు బాల్టిమోర్ రెడీన్యూయార్క్‌లో వైభవంగా NYTTA బోనాల జాతరనాట్స్ డల్లాస్ చాప్టర్ నూతన కార్యవర్గం ఇదేలండన్‌లో ఘనంగా టాక్ బోనాల జాతర
Previous Article Next Article