ఫిలడెల్ఫియాలో రాజేంద్రప్రసాద్‌కు సన్మానం

🕑 Published: August 13, 2026 at 09:25 AM CST

ఇటీవల భారత ప్రభుత్వం నుంచి ‘పద్మ శ్రీ’ పురస్కారం అందుకున్న నటుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్‌కు అమెరికాలోని ఫిలడెల్ఫియా తెలుగు కమ్యూనిటీ ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఆగస్టు 9న పెన్సిల్వేనియాలోని చెస్టర్ స్ప్రింగ్స్ ‘బైయర్స్ స్టేషన్ క్లబ్ హౌస్‌’లో రవి పొట్లూరి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రవాస తెలుగు ప్రజలు విశేష సంఖ్యలో హాజరయ్యారు. రాజేంద్ర ప్రసాద్‌ విలక్షణమైన నటనతో చిత్రపరిశ్రమలో దాదాపు 49 సంవత్సరాలుగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారని తెలుగు సంఘాల ప్రతినిధులు, అభిమానులు కొనియాడారు. హాస్యరస చిత్రాలతోపాటు ఎన్నో ఉత్తమ పాత్రలతో అలరించిన ఆయనకు పద్మశ్రీ అవార్డు రావడం తెలుగుజాతికే గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ నిర్వహిస్తున్న ఛారిటబుల్ ట్రస్ట్‌కు రూ.8 లక్షల విరాళం అందించారు. అనంతరం శాలువాలు, జ్ఞాపికలతో రాజేంద్ర ప్రసాద్‌ను ఘనంగా సన్మానించారు.

ప్రవాస తెలుగు ప్రజలు తనపై చూపిస్తున్న ఆప్యాయతకు, ప్రేమానురాగాలకు రాజేంద్ర ప్రసాద్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సముద్రాలు దాటి వచ్చినా తెలుగు ప్రజలు తనపై చూపిస్తున్న ప్రేమాభిమానాలు చూస్తుంటే కన్నతల్లి ఒడిలో ఉన్నట్లుందన్నారు. మీ ప్రేమే నన్ను ఇన్నేళ్లుగా నటుడిగా ముందుకు నడిపిస్తోందని పేర్కొన్నారు. పద్మశ్రీ’ పురస్కారం తనకు లభించిన గౌరవం మాత్రమే కాదని, తనను ఆదరించిన తెలుగు ప్రేక్షకులందరికీ చెందుతుందన్నారు. నటుడిగా తన 49 ఏళ్ల ప్రయాణంలో నవ్వులను పంచి, ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకోవడం కన్నా పెద్ద అవార్డు మరొకటి లేదన్నారు. ఈ కార్యక్రమానికి శ్వేత కొమ్మోజి వ్యాఖ్యాతగా వ్యవహరించగా.. జగదీప్ రెడ్డి ఆనుముల, పరమేశ్ భీమ్ రెడ్డి, వేణు సంగాని, సతీష్ తుమ్మల, రామకృష్ణ తాడిశెట్టి, గిరిధర్ మసిరెడ్డి, వేణు కోమటిరెడ్డి, ఫణి కంతేటి, రాజు కక్కెర, సురేష్ వెంకన్నగారి, సునీల్ కోగంటి, వెంకట్ సింగు తదితరులు పాల్గొన్నారు.

📲 Join Our WhatsApp Channel
గుండ్లకమ్మ నదీమ తల్లి ఒడ్డున యాత్రకు శ్రీకారంరాష్ట్రపతి నుండి సంగీత నాటక అకాడమీ అవార్డు అందుకున్న గుమ్మడిహాంకాంగ్‌లో 27వ కార్గిల్ విజయదివస్సింగపూర్‌లో TCSS ఆధ్వర్యంలో ఘనంగా బోనాల జాతరParis-France: ఐఫిల్ టవర్ వద్ద ఎన్నారై తెదేపా సమావేశంమలేషియాలో ఘనంగా MYTA బోనాలుCalifornia: AHUB Global Presents Its Vision To Bhattiబే-ఏరియా ప్రవాసులను నిరాశపరిచిన భట్టిRecap: తెలుగు వైభవానికి పట్టం కట్టిన ఆటా 19వ మహాసభలుఆలోచనే సిలికానాంధ్ర ఆయుధం - TNI ప్రత్యేకంTCSS సింగపూర్ అధ్యక్షుడిగా నల్ల భాస్కర్ గుప్తమిషిగన్‌లో రుక్మిణి కల్యాణం2029లో టీడీపీ విజయమే లక్ష్యం-జర్మనీ ఎన్నారై తెదేపాఎస్.జానకికి డల్లాస్ అభిమానుల సంగీత నివాళిన్యూజెర్సీలో పర్యటించిన తెభాజపా అధ్యక్షుడు రామచందర్‌రావుసిలికానాంధ్ర సిగలో మరో మూడు గిన్నీస్ రికార్డులుహైదరాబాద్‌లో ₹20 కోట్లతో ఎన్‌ఆర్‌ఐ భవన్-ఆటా వేడుకల్లో మంత్రి జూపల్లివైవిధ్యంగా సిలికానాంధ్ర దాతల అభినందన సభతానా-పాఠశాల ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవంఅట్టహాసంగా ఆరంభమైన "ఆటా"
No Previous Next Article