ట్రైవ్యాలీ తెలుగు సంఘం(తత్వా) ఆధ్వర్యంలో కరోనా బాధితులకు సేవలందిస్తున్న వైద్యులు, నర్సులు ఇతర అత్యవసర సేవకులకు 500మాస్క్‌లు, 45 హెడ్ కవరింగ్స్‌ను విరాళంగా అందజేశారు. లాక్‌డౌన్‌లో గృహాలకే పరిమితమైన ప్రవాస చిన్నారులు వీటిని ప్రత్యేకంగా తయారు చేశారు. వీటిని థౌజండ్ ఓక్స్‌లోని లాస్ రోబ్లెస్ మెడికల్ సెంటర్‌కు అందజేశారు. ఆసుపత్రి అత్యవసర విభాగ ప్రతినిధి కార్లో రీయిస్ తత్వా సాయానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని శిరిషా పొట్లూరి, అనుపమ సీమకుర్తి, భారితి రాజమణి, బిందు పోలవరపు, దుర్గ వలివేటి, హైమ బుద్ధిరాజు, కాంచన్, లక్ష్మి గోతెటి, లక్ష్మి నిస్టాల, లక్ష్మి పడాల, నీలిమ యాదల్ల, శ్రియ పొన్నగంటి, సుహారిత అల్లు, సునిత బొప్పుడి, సునిత మరసకట్ల, తులసి అడప, విజయ కొప్పు తదితరులు సమన్వయపరిచారు.
కరోనా సేవకులకు “తత్వా” విరాళం
Related tags :