కెనడా - ఘనంగా తాకా విశ్వావసు ఉగాది ఉత్సవం

Featured Image

తాకా(TACA- Telugu Alliances of Canada) ఆధ్వర్యంలో శనివారం నాడు గ్రేటర్ టోరొంటో మిస్సిస్సాగా నగరంలోని గ్లెన్ ఫారెస్టు సెకండరీ స్కూలు ఆడిటోరియంలో విశ్వావసు ఉగాది పండుగ ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. తాకా జనరల్ సెక్రెటరి ప్రసన్న కుమార్ తిరుచిరాపల్లి స్వాగతోపన్యాసం చేశారు. ధనలక్ష్మి మునుకుంట్ల, ప్రశాంతి పిన్నమరాజు, అశ్విత అన్నపురెడ్డి, మాధురి హొస్కొటె రాము, సరిత కుందేర్ జ్యోతి ప్రజ్వలన చేశారు. కెనడా జాతీయ గీతం ఆలాపనతో వేడుకలు ప్రారంభమయ్యాయి. పురోహితులు మంజునాథ్ పంచాంగ శ్రవణం చేశారు. తాకా ఉగాది పురస్కారం ఆరోగ్యం, ధ్యానం, యోగా పరివ్యాప్తికి కృషి చేసిన వెంకట అప్పారావు సూరిసెట్టికి అందజేశి సత్కరించారు.

తాకా అధ్యక్షుడు రమేశ్ మునుకుంట్ల సభికులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్య అతిధిగా ICICI Canada CFO హిమధర్ మద్దిపట్ల హాజరయ్యారు. జనరల్ సెక్రెటరి ప్రసన్నకుమార్ తిరుచిరాపల్లి, ఫౌండెషన్ కమీటీ చైర్మన్ అరుణ్ కుమార్, ఫౌండరు హనుమంతాచారి సామంతపుడిలు సభికులనుద్దేసించి ప్రసంగించారు. రుచికరమైన తెలుగు భోజనం ఆరగించారు. శ్రీరాం జిన్నాల, కోశాధికారి మల్లిఖార్జునాచారి పదిర, సాంస్కృతిక కార్యదర్శి అనిత సజ్జ, డైరక్టర్లు ప్రదీప్ కుమార్ రెడ్డి ఏలూరు, దుర్గా ఆదిత్యవర్మ భూపతిరాజు, ప్రశాంతి పిన్నమరాజు, సాయి కళ్యాణ్ వొల్లాల, అశ్విత అన్నపురెడ్డి, యశ్వంత్ రెడ్డి కర్రి, రాజా అనుమకొండ, సంతోష్ కుమార్ కొంపల్లి, ఫౌండెషన్ కమీటీ చైర్మన్ అరుణ్ కుమార్ లాయం, ట్రస్టీబోర్డు చైర్మన్ సురేశ్ కూన, ట్రస్టీలు వాణి జయంతి, పవన్ బాసని తదితరులు సహకరించారు.

Tags-South Africa Telugu Andhra Ugadi 2025

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles