శ్రీనివాస కళ్యాణోత్సవం నిర్వహించిన సింగపూర్ తెలుగు సమాజం

Featured Image

సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో విశ్వావసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ శ్రీనివాసునకు సుప్రభాతసేవ, తోమాలసేవ, అభిషేకం, సహస్ర నామార్చన, మహాలక్ష్మి, విష్ణుదుర్గ, ఆంజనేయ స్వామికి అభిషేకము తదితర విశేష కైంకర్యములతో శ్రీవారి కళ్యాణోత్సవాన్ని స్థానిక సెరంగూన్ రోడ్ లోని శ్రీ శ్రీనివాస పెరుమాళ్ దేవాలయంలో ఆదివారం నాడు ఘనంగా నిర్వహించారు. కళ్యాణోత్సవంలో పాల్గొన్న జంటలకు వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. తెలుగు సమాజం అధ్యక్షులు బొమ్మారెడ్డి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ- తెలుగు వారందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపి,ఈ సంవత్సరం అందరికీ మేలు జరగాలని ఆకాంక్షించారు. సింగపూర్ తెలుగు సమాజం స్వర్ణోత్సవాలు మే 11న నిర్వహిస్తున్నామని వెల్లడించారు. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం, కళ్యాణ తలంబ్రాలు, మంగళ ద్రవ్యాలను భక్తులకు అందజేశామని కార్యక్రమ నిర్వాహకులు అనిల్ పోలిశెట్టి తెలిపారు. సింగపూర్ లో అరుదుగా లభించే వేప పువ్వుతో చేసిన ఉగాది పచ్చడిని అందించారు.

Tags-Singapore Telugu Samajam Srinivasa Kalyanam On Ugadi 2025

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles