సింగపూర్‌లో వైభవంగా ఉగాది వేడుకలు

Featured Image

తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు పోటోన్గ్ పాసిర్ లోని శ్రీ శివ దుర్గ ఆలయంలో ఆదివారం నాడు న్రివహించారు. అందరికి మంచి జరగాలని ఉగాది పర్వదినాన సొసైటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. పేరి కృష్ణ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. బుట్టే వీరభద్ర దైవజ్ఞ (శ్రీ శ్రీశైల దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి) రూపొందించిన గంటల పంచాంగాన్ని సభ్యులకు అందజేశారు. ఉగాది పచ్చడి, పులిహోర ప్రసాదాలను భక్తులకు పంచారు. TCSS అధ్యక్షుడు గడప రమేష్ బాబు సభికులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. భారత కాన్సులేట్ అధికారి వై.ఎస్.వి.ఎస్.ఆర్.కృష్ణ ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి సమన్వయకర్తలుగా ప్రాంతీయ కార్యదర్శులు సంతోష్ వర్మ మాదారపు, భాస్కర్ నడికట్ల, శశిధర్ ఎర్రమ రెడ్డి, ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్, దుర్గ ప్రసాద్ , సంతోష్ కుమార్ జూలూరి మరియు ప్రశాంత్ బసిక, ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి మిర్యాల, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కార్యవర్గ సభ్యులు పెరుకు శివ రామ్ ప్రసాద్ తదితరులు వ్యవహరించారు. కోశాధికారి నంగునూరి వెంకట రమణ, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి, రవి కృష్ణ విజాపూర్, కార్యవర్గ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు పులిగిళ్ల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రావుల సుగుణాకర్ రెడ్డి, చల్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags-Singapore TCSS Ugadi 2025

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles