శ్రీ సాంస్కృతిక కళాసారథి ఉగాది సంబరం

Featured Image

'శ్రీ సాంస్కృతిక కళాసారథి' ఆధ్వర్యంలో సింగపూర్ లో 'విశ్వావసు ఉగాది వేడుకలు' శనివారం నాడు ఘనంగా నిర్వహించారు. ప్రముఖ రచయిత డాక్టర్ రామ్ మాధవ్, విశిష్ట అతిథులుగా పార్లమెంట్ సభ్యురాలు డి.కె.అరుణ, సింగపూర్ తెలుగు సమాజం పూర్వ అధ్యక్షులు వామరాజు సత్యమూర్తి పాల్గొన్నారు. సింగపూర్ తెలుగు గాయనీ గాయకులు పాటలతో అలరించారు. నాట్య కళాకారుల ప్రత్యేక నృత్య ప్రదర్శనలు, చిన్నారుల పద్య పఠనాలు ఆకట్టుకున్నాయి. సంస్థ అధ్యక్షుడు కవుటూరు రత్నకుమార్ సభికులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. సింగపూర్ కవయిత్రి కవిత కుందుర్తి రచించిన కవితా సంపుటి 'Just A Housewife' మరియు రామ్ మాధవ్ రచించిన 'Our Constitution Our Pride' పుస్తకాలు ఆవిష్కరించారు. "స్వర" నాట్య సంస్థ కళాకారుల నాట్య ప్రదర్శనలు, చిన్నారులు ఉగాది పాటకు నాట్య ప్రదర్శన చేయగా, స్వరలయ ఆర్ట్స్, మహతి సంగీత విద్యాలయం, విద్య సంగీతం, జయలక్ష్మి ఆర్ట్స్ సంస్థల విద్యార్థులు గీతాలాపన చేశారు. సింగపూర్ గాయనీమణులు తంగిరాల సౌభాగ్య లక్ష్మి, శైలజ చిలుకూరి, సౌమ్య ఆలూరు, శరజ అన్నదానం, షర్మిల, శేషు కుమారి యడవల్లి, ఉషా గాయత్రి నిష్టల, రాధిక నడదూర్, శ్రీవాణి, విద్యాధరి, దీప తదితరులు సంప్రదాయ భక్తి పాటలు, ఉగాది పాటలు, శివ పదం కీర్తనలు వినిపించారు. వేదుల శేషశ్రీ వీణ, భమిడిపాటి ప్రభాత్ దర్శన్ వాయులీనాలపై ప్రతిభను ప్రదర్శించారు.

రామ్ మాధవ్ మాట్లాడుతూ తెలుగు భాషకు ఆదరణ తగ్గుతున్న ఈ రోజుల్లో తెలుగు భాష గొప్పతనం చాటేలా ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. డి కె అరుణ మాట్లాడుతూ "నేను 14 ఏళ్ల తర్వాత ఎంపీ హోదాలో సింగపూర్ లో ఇలా ఉగాది వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉంది. పిల్లలు ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే సంతోషిస్తున్నాం, కానీ తెలుగు భాష గొప్పతనాన్ని వాళ్లకు నేర్పించడం లేదు. విదేశాలలో ఉన్నటువంటి తెలుగువారు ఇలా తెలుగు భాష గొప్పతనాన్ని చాటుతూ, మన సంప్రదాయాలు, కట్టుబాట్లు చిన్న పిల్లలకు, భావి తరాలకు నేర్పుతుండటం అభినందనీయం" అన్నారు. వామరాజు సత్యమూర్తి సింగపూర్‌లో తన పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమములో తెలంగాణ కల్చరల్ సొసైటీ కార్యవర్గ సభ్యులు, తెలుగు సమాజం సభ్యులు, సాంస్కృతిక కళాసారథి సంస్థ సభ్యులు రామాంజనేయులు చామిరాజు, శ్రీధర్ భరద్వాజ్, పాతూరి రాంబాబు, వ్యాఖ్యాత సౌజన్య బొమ్మకంటి, అతుల్, కుమార్, స్కేటర్ నైనికా ముక్కాల, కాత్యాయనీ గణేశ్న, వంశీకృష్ణ శిష్ట్లా తదితరులు పాల్గొన్నారు.

Tags-Sri Samskrtika Kalasaradhi Singapore Ugadi 2025

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles