ఫ్రిస్కో నాట్స్ అడాప్ట్ ఎ పార్క్ కార్యక్రమం

Featured Image

నాట్స్ అడాప్ట్ ఎ పార్క్ కార్యక్రమాన్ని ఫ్రిస్కోలో చేపట్టారు. డల్లాస్ నాట్స్ విభాగం ఆధ్వర్యలో ఫ్రిస్కో మోనార్క్ పార్క్‌ ను శుభ్రం చేశారు. ప్రకృతిని కాపాడేందుకు, శుభ్రతను ప్రోత్సహించేందుకు అడాప్ట్ ఎ పార్క్ వంటి కార్యక్రమాలు ఎంతో మేలును కలిగిస్తాయని, పార్కులను శుభ్రంగా ఉంచడం వల్ల పర్యావరణ హితమైన జీవనశైలికి మార్గం సుగమం అవుతుందని నాట్స్ పూర్వ అధ్యక్షులు బాపు నూతి అన్నారు. విద్యార్ధుల్లో సామాజిక బాధ్యత పెంచేందుకు నాట్స్ చేపట్టిన ఈ సామాజిక సేవా కార్యక్రమం ద్వారా విద్యార్ధుల సేవను అమెరికా ప్రభుత్వం గుర్తిస్తుందని నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రాజేంద్ర మాదాల తెలిపారు.

డల్లాస్ చాప్టర్ సమన్వ్యకర్తలు స్వప్న కాట్రగడ్డ, శ్రావణ్ నిడిగంటి, జాయింట్ ట్రెజరర్ రవి తాండ్ర, జోనల్ వైస్ ప్రెసిడెంట్ సత్య శ్రీరామనేని, నేషనల్ కోఆర్డినేటర్ ఫర్ మీడియా రిలేషన్స్ కిషోర్ నారె, సభ్యులు శివ మాధవ్, బద్రి, కిరణ్, పావని, శ్రీ దీపిక, ఉదయ్, వంశీ, వీరా తదితరులు పాల్గొన్నారు.

నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, అధ్యక్షులు మదన్ పాములపాటిలు అభినందనలు తెలిపారు. జూలై 4,5,6 తేదీల్లో టంపాలో జరిగే 8 వ అమెరికా తెలుగు సంబరాలకు డల్లాస్‌లో ఉండే తెలుగువారంతా తరలిరావాలని కోరారు. https://www.sambaralu.org/

Tags-NATS Dallas Adopt A Park In Frisco

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles