ఒంటారియో తెలుగు ఫౌండేషన్ ఉగాది వేడుకలు.

Featured Image

కెనడా ఒంటారియో తెలుగు ఫౌండేషన్ (OTF) ఆధ్వర్యంలో విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ వేడుకలు టొరంటోలో ఘనంగా నిర్వహించారు. ఈ ఉగాది వేడుకలు సమన్వయకర్తలు ప్రవీణ్ నీల, చంద్ర చల్లా ముఖ్య వ్యాఖ్యాతలుగా ప్రారంభించగా ఒంటారియో తెలుగు ఫౌండేషన్ మహిళా సమన్వయకర్తలు- వరలక్ష్మి గంధం, ఝాన్సీ బదాపురి, గీత రెడ్డిచెర్ల, శ్రీదేవి నీల, శిరీష ఘట్టి, లావణ్య ఆలూరి, ఆకర్ష కస్తూరి జ్యోతి ప్రజ్వలనతో ఉగాది ఉత్సవాలు ప్రారంభించారు. అనంతరం కిషోర్ శర్మ పంచాంగ శ్రవణం నిర్వహించారు. తదుపరి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా రీజినల్ కౌన్సిల్ ఫర్ విట్బీ - స్టీవ్ యమాడ, మలీహా షాహిద్ హాజరయ్యారు. ఒంటారియో ప్రీమియర్ డగ్ ఫోర్డ్ ప్రత్యేక సందేశంతో తెలుగు ప్రజలందరికి విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అయిదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒంటారియో తెలుగు ఫౌండేషన్ సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతూ. ఒంటారియో ప్రజలకు ఉపయోగపడే ఎన్నో అద్భుత కార్యక్రమాలు చేస్తున్న సంస్థని కొనియాడారు. ప్రవీణ్ నీల రచనా దర్శకత్వంలో, ప్రసాద్ ఘట్టి సహకారంతో "భక్త ప్రహ్లాద" పౌరాణిక దృశ్యరూపకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ వేడుకల నిర్వహణకు రఘు జూలూరి, రమేష్ గొల్లు, ఆనంద్ పేరిచర్ల, రామ్ జిన్నాల, సుష్మ వరదరాజన్, కల్పేష్ పటేల్, కృష్ణ కుమారి కోటేరు, జోయెల్ ప్రకాష్, పుష్పిందర్ గిల్, చంద్ర యార్లగడ్డ, రవికిరణ్ ఇప్పిలి, శాయంతన్ మహేషన్, డా" సౌజన్య కాసుల, మురళి కృష్ణ రాతేపల్లి, అబ్దేల్ బెనుటాఫ్, భరత్ కుమార్ సత్తిలకు కార్యవర్గం ధన్యవాదాలు తెలిపింది. దినేష్, శ్రీని ఇజ్జాడ, దీప-నవీన్ సూదిరెడ్డి, మురళి రెడ్డిచెర్ల, మంజూష చేబ్రోలు, భరత్ వేంకటాద్రి, మహీధర్ ఆలూరి, కళ్యాణ్ కస్తూరి తదితరులు పాల్గొన్నారు.

Tags-Ontario Telugu Foundation Ugadi 2025

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles