అలరించిన న్యూజెర్సీ తెలుగు కళా సమితి ఉగాది వేడుకలు

Featured Image

న్యూజెర్సీ తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో శనివారం నాడు బ్రిడ్జి వాటర్ ఆలయ సమావేశ మందిరంలో ఉగాది వేడుకలు నిర్వహించారు. అన్నా మధు అధ్యక్షతన ఈ ఉత్సవాలు నిర్వహించారు. 9 నృత్య కళాశాలల, 13 సంగీత కళాశాలల గురువులను సత్కరించారు. ఇండియా నుంచి వచ్చిన మాచిరాజు రాజేష్ కుమార్ మండూక శబ్ద నాట్యంతో అలరించారు. స్థానిక ప్రవాస సంగీత, నృత్య కళాశాలల విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. తెలుగు కళాసమితి కార్యవర్గ సభ్యులు ప్రదర్శించిన భువన విజయం మైమరిపించింది. వసంత శోభ, కవి సమ్మేళనం, పురుషుల ఫ్యాషన్ షో, హాస్య నాటికలు, జానపద నృత్యాలు, సినీ సంగీత నృత్య కార్యక్రమాలు సైతం ఏర్పాటు చేశారు. "మాటా" సభ్యులు ప్రత్యేక సాహిత్య కార్యక్రమంలో భాగంగా పద్య పఠనం చేశారు. ఉగాది పచ్చడి, విందు భోజనాలు అందించారు.

గనగోని శ్రీనివాస్, కిరణ్ దుడ్డగి, కుమార్ రాణి, లలిత రాణి, వందేమాతరం తరంగ్, మాళవిక ఆనంద్, చల్లా సృష్టి, కామరసు ధృతి, తమ్మా సమీరా, బొందుగుల అద్వైత్, ఉపేంద్ర చివుకుల, తాతా వెంకటసత్య, వూటుకూరు ప్రసాద్, కునిశెట్టి వాణి, మాదిశెట్టి లత, కంభంమెట్టు శేషగిరి, గిర్కల లోకేంద్ర, షకేలి అరుంధతి, వరలక్ష్మి శ్రీనివాస్ తదితరులు పాల్గొని సహకరించారు.

Tags-NJ TFAS Ugadi 2025 - Madhu Anne

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles