హాంగ్‌కాంగ్‌లో విశ్వావసు ఉగాది వేడుకలు

Featured Image

హాంకాంగ్‌లో ఉగాది వేడుకలను ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య (THKTS) ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. గత 22 ఏళ్లుగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నామని అధ్యక్షురాలు జయ పీసపాటి తెలిపారు. చింగ్ మింగ్ ఉత్సవం కారణంగా హాంకాంగ్‌లో సుదీర్ఘ వారాంతం సెలవలు ఉన్నప్పటికీ, ప్రవాసులు పెద్ద సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాంకాంగ్ & మకావులోని భారత కాన్సులేట్ జనరల్ నుండి కాన్సుల్ కూచిభొట్ల వెంకటరమణ, హోం అఫైర్స్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ జిల్లా అధికారి మొక్ మాంగ్-చాన్, ఎన్.ఎ.ఎ.సి టచ్ సెంటర్ ప్రాంతీయ డైరెక్టర్ కోనీ వాంగ్, హాంకాంగ్‌లో ఐసిఐసిఐ బ్యాంక్ అధికారి దేవేష్ శర్మలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

దీప ప్రజ్వలనతో ఉగాది వేడుకలు ప్రారంభమయ్యాయి. "మా తెలుగు తల్లి" గీతాలాపన చేశారు. కూచిభొట్ల వెంకటరమణ తెలుగు భాష, సాంస్కృతిక విలువలను పునరుద్ఘాటించారు. తెలుగు సమాఖ్య ద్వారా హాంగ్ కాంగ్ తెలుగు ప్రజలకు చేస్తున్న సేవలను ఆయన అభినందించారు. THKTS వ్యవస్థాపక అధ్యక్షురాలు జయ పీసపాటి మాట్లాడుతూ తెలుగువారిలో ఒక అనుబంధ భావనను సృష్టించడం ముఖ్యోద్దేశంగా సంస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడం, దాన్ని సమాజానికి తిరిగి ఇవ్వడం తమ ప్రధాన లక్ష్యాలని అన్నారు. సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చిన కళాకారులను కాన్సల్ వెంకటరమణ పురస్కారాలతో అభినందించారు.

Tags-HongKong Telugu Samakhya THKTS Ugadi 2025

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles