ఫిన్‌ల్యాండ్‌లో తెదేపా అభిమానుల సమావేశం

Featured Image

తెలుగుదేశం ప్రభుత్వం విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకురావాలనే కృతనిశ్చయంతో ఉందని మాజీ ఎమ్మెల్సీ డా:ఏ.యస్.రామకృష్ణ అన్నారు. బుధవారం నాడు ఫిన్లాండ్ రాజధాని హెల్సింకీలో తెలుగు సంఘాలు, తెలుగుదేశం పార్టీ అభిమానులతో సమావేశం నిర్వహించారు. రామకృష్ణ మాట్లాడుతూ విద్యారంగంలో ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో నిలిచిన ఫిన్లాండ్ దేశాన్ని సందర్శించటం చాలా సంతోషంగా ఉందన్నారు.ఒక్క విద్యా రంగంలోనే గాక్ హేపీనెస్ ఇండెక్స్ లో కూడా ముందు వరసలో నిలిచిందన్నారు. చంద్రబాబు సారథ్యంలోని తెదేపా ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తొందని వివరించారు. మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ పసి వయస్సులో మార్కులు-ర్యాంకులు-డబ్బులు గాకుండా విలువలతో కూడిన విద్యకు ఫిన్‌ల్యాండ్ ఇస్తున్న ప్రాధాన్యత ముదావహమని అన్నారు. ఫిన్‌ల్యాండ్ తెలుగు సంఘం అధ్యక్షుడు కాకర్ల రమేష్, ఫిన్లండ్ కల్చరల్ అసోసియేషన్ స్పోర్ట్స్ అధ్యక్షుడు రామకృష్ణ వెలగపూడి, వెంగళరావు సాధినేని, శ్రీనివాస్ నాగబోయిన,రమేష్ శరణు, సుధాకర్ చల్లగుంట్ల, నక్కా కిషోర్, సుదర్శన్ బాబు నాగినేని తదితరులు పాల్గొన్నారు.

Tags-Finland NRI TDP Meet Ramakrishna Mannava Subbarao

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles