తెలంగాణ కెనడా సంఘం ఆధ్వర్యంలో ఉగాది-శ్రీరామనవమి వేడుకలు

Featured Image

గ్రేటర్ టొరంటోలో తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో శ్రీరామనవమి మరియు విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. పురోహితులు నరసింహాచార్యులు పంచాంగ శ్రవణం నిర్వహించగా, శ్రీకాంత్ కాసర్ల సీతా రాముల కల్యాణోత్సవాలు నిర్వహించారు. ఉత్సవాలలో విభిన్న వయస్సులవారు ఉత్సాహంగా పాల్గొన్నారు.

సాంస్కృతిక కార్యక్రమాల్లో 135 కళాకారులు 23 వినూత్న ప్రదర్శనలతో అలరించారు. 13 సంవత్సరాల లోపు చిన్నారుల కోసం నిర్వహించిన స్పెల్లింగ్ ఛాలెంజ్ పోటీలకు విశేష స్పందన లభించగా, విజేతలకు ట్రోఫీలు అందజేశారు. కార్యక్రమానికి రమేష్ న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. స్ఫూర్తి కొప్పు, శ్రీరంజని కందూరి, వరుణి గుజ్జుల యాంకరింగ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్ మన్నెం, ఉపాధ్యక్షులు శంతన్ నారెళ్ళపల్లి, కార్యదర్శి శంకర్ భరద్వాజ పోపూరి, సాంస్కృతిక కార్యదర్శి స్ఫూర్తి కొప్పు, సంయుక్త కార్యదర్శి ప్రణీత్ పాలడుగు, కోశాధికారి రాజేష్ అర్ర, సంయుక్త కోశాధికారి నాగేశ్వరరావు దలువాయి, డైరెక్టర్లు శ్రీరంజని కందూరి, కోటేశ్వర్ చెటిపెల్లి, ఆనంద్ తొంట, శరత్ యరమల్ల, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చైర్మన్ నవీన్ ఆకుల, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యులు పవన్ కుమార్ పెనుమచ్చ, మాధురి చాతరాజు, రాము బుధారపు, వ్యవస్థాపక కమిటీ చైర్మన్ హరి రావుల్, వ్యవస్థాపక సభ్యులు దేవేందర్ రెడ్డి గుజ్జుల, కోటేశ్వర రావు చిత్తలూరి, శ్రీనివాస తిరునగరి, వేణుగోపాల్ రోకండ్ల, రాజేశ్వర్ ఈద, విజయ్ కుమార్ తిరుమలపురం, అఖిలేష్ బెజ్జంకి, ప్రభాకర్ కంబాలపల్లి మరియు ప్రకాష్ చిట్యాల తదితరులు పాల్గొన్నారు.

Tags-Telangana Canada Association TCA Ugadi Ramanavami in Canada Toronto

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles