షార్లెట్‌లో తెదేపా శాసనసభ్యుల పర్యటన

Featured Image

అమెరికాలోని ఉత్తర కరోలినా రాష్ట్రం షార్లెట్ ఎన్నారై తెదేపా శ్రేణులతో తెదేపా శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి (మార్కాపురం), కూన రవికుమార్‌(ఆముదాలవలస)లు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు.

రవికుమార్‌ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని అప్పటి కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీరామారావు స్థాపించారని, అమెరికాలో ఇన్ని లక్షలమంది తెలుగువాళ్ళు ఐటీ రంగంలో ముందున్నారంటే అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కారణమని అన్నారు. నారాయణరెడ్డి ఎన్నారైలు రాష్ట్ర ప్రగతికోసం పెట్టుబడులతో ముందుకు రావాలని కోరారు. ప్రవాసులు నాగ పంచుమర్తి, ఠాగూర్ మల్లినేని, రమేష్ ముకుళ్ళ, సతీష్ నాగభైరవ, రాజేష్ వెలమల, జనసేన, బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags-TDP MLAs Koona Ravikumar Kandula Narayanareddy Tour Charlotte USA

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles