శాండియాగో నాట్స్ విభాగం ప్రారంభం

Featured Image

అమెరికావ్యాప్తంగా విభాగాలు ప్రారంభిస్తూ నాట్స్ సంస్థ ప్రవాస తెలుగువారికి చేరువ అవుతోంది. ఇందులో భాగంగా శాండియాగోలో నాట్స్ విభాగాన్ని ప్రారంభించింది. నాట్స్ శాండియాగో చాప్టర్ సమన్వయకర్తగా ప్రశాంతి ఊడిమూడి, మహిళా సాధికార సలహా మండలి సమన్వయకర్తగా హైమ గొల్లమూడి, సాంస్కృతిక కార్యక్రమాల సమన్వయకర్తగా కామ్య శిష్ట్లా, సోషల్ మీడియా సమన్వయకర్తగా తేజస్వి కలశిపూడి, సేవా కార్యక్రమాల సమన్వయకర్తగా రామచంద్రరాజు ఊడిమూడి, క్రీడా సమన్వయకర్తగా సత్య హరిరామ్, ఆది మోపిదేవిలు వ్యవహరించనున్నరు.

చాప్టర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. తనుష్ భగవత్, వీణ-ఋత్వ ఊడిమూడి గానామృతం, వయోలిన్‌తో ధ్రువ గౌరిశెట్టి, పియానోతో విహాన్ మండపాక అలరించారు. అతిథులుగా నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి,నాట్స్ సెక్రటరీ మధు బోడపాటి,జోనల్ వైస్ ప్రెసిడెంట్ మనోహర్ మద్దినేని, ప్రోగ్రామ్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చిలుకూరి,జాతీయ మహిళా సాధికారత సమన్వయకర్త రాజ్యలక్ష్మి చిలుకూరి,లాస్ ఏంజెలెస్ చాప్టర్ సమన్వయకర్త మురళి ముద్దన, హెల్ప్ లైన్ సమన్వయకర్త శంకర్ సింగంశెట్టిలు పాల్గొన్నారు. శాండియాగో నాట్స్ విభాగం చేపట్టే ప్రతి కార్యక్రమానికి జాతీయ నాయకత్వం మద్దతు ఉంటుందని మదన్ పాములపాటి వెల్లడించారు. శాండియాగో చాప్టర్ ఏర్పాటులో నాట్స్ జాతీయ మీడియా కో ఆర్డినేటర్ కిషోర్ నారే కీలక పాత్ర పోషించడం అభినందనీయమని అన్నారు. నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, ప్రెసిడెంట్ (ఎలెక్ట్) శ్రీహరి మందాడి తమ అభినందనలు సందేశం ద్వారా పంపారు.

Tags-SanDiego NATS Telugu Chapter Launched

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles