జర్మనీలో ఉగాది వేడుకలు

Featured Image

తెలుగు వెలుగు జర్మనీ సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు మంగళవారం నాడు ఫ్రాంక్‌ఫర్ట్ నగరంలో ఘనంగా నిర్వహించారు. ఫ్రాంక్‌ఫర్ట్, పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తెలుగు కుటుంబాలు పాల్గొని.. సంగీతం, నృత్యం, సంప్రదాయ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. సంస్థ వ్యవస్థాపకులు సాయిరెడ్డికి నివాళులు అర్పించారు.

సంఘం జనరల్ సెక్రటరీ సూర్యప్రకాష్ వెలగా మాట్లాడుతూ.. తెలుగు కమ్యూనిటీ ఇటీవల వేగంగా ఎదుగుతోందని, తెలుగు భాష, సంస్కృతి, ఐక్యతకు ఈ వేడుక ప్రతీకగా నిలిచిందన్నారు. సాయిరెడ్డి ఆశయ సాధనకు కృషి చేస్తామని తెలిపారు. ఈ వేడుకకు ఫ్రాంక్‌ఫర్ట్ బర్గర్‌ మాస్టర్ నసరిన్ ఎస్కందారి-గ్ర్యూన్‌బర్గ్ ముఖ్య అతిథిగా హాజరై జర్మనీలో తెలుగు సమాజానికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. సంబరాల్లో చిన్నారులు, యువత, కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమాన్ని ప్రీతం బొడా విట్టల్, ఆదర్శ్ వంగల సమన్వయపరిచారు.

Tags-Telugu Velugu Germany Ugadi 2025

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles