ఫ్రిస్కోలో తెలుగు ప్రముఖులతో యార్లగడ్డ భేటీ

Featured Image

విశ్వహింది పరిషత్ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ మాజీ సభ్యులు, డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ శుక్రవారం నాడు డల్లాస్ పరిసర ప్రాంతమైన ఫ్రిస్కోలో స్థానిక ప్రవాస తెలుగు ప్రముఖులతో సమావేశమయ్యారు. అమెరికా తెలుగు సంఘం (ఆటా) మాజీ అధ్యక్షుడు డా. జీ. ఆత్మచరణ్‌రెడ్డి నివాసంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తానా మాజీ అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర, నాటా మాజీ అధ్యక్షుడు డా. కొర్సపాటి శ్రీధర్‌రెడ్డి, ప్రముఖ హృద్రోగ నిపుణులు, సాహితీవేత్త డా. ఆళ్ల శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సాహిత్య, సామాజిక, ప్రవాస వ్యవహారాలపై చర్చించారు. ట్రంప్ నూతన విధానలతో ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు అమెరికాలో దీర్ఘకాలికంగా స్థిరపడిన ప్రవాస ప్రముఖులు చేయూతనందించాలని యార్లగడ్డ అభ్యర్థించారు. కార్యక్రమంలో డా. తుమ్మల చైతన్య, అటార్నీ చాంద్ పర్వతనేని, ఏ.యూ. ప్రొఫెసర్ పర్వతనేని సుబ్బారావు, తానా మాజీ కార్యదర్శి వెన్నం మురళీ, సమీర్, మధు ఓరుగంటి, వెంకట్, శివ, రమణ్‌రెడ్డి, రవి, శ్రీనాథ్, దేవినేని ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.

Tags-Yarlagadda Lakshmiprasad Meets Frisco Telugus

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles