డల్లాస్‌లో ఈద్ మిలాప్...పాల్గొన్న డా.పెమ్మసాని

Featured Image

డల్లాస్‌లో ముస్లిం సంఘీభావం, శాంతి, మానవతా విలువలకు బలమైన సందేశాన్ని ఇచ్చే విధంగా ఈద్ మిలాప్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నసీం షేక్ సమన్వయంలో శనివారం నాడు ఇర్వింగ్‌లోని విమల్ బాంక్వెట్ హాల్‌లో ఈ వేడుకను స్థానికులతో కలిసి నిర్వహించారు. ఈ కార్యక్రమం ఉత్తర అమెరికా ఆంధ్ర ముస్లిం సంఘం (AMANA) ఆధ్వర్యంలో జరిగింది. ముస్లిం, హిందూ, క్రిస్టియన్ సమాజాల నుంచి ప్రవాసులు హాజరయ్యారు.

ముఖ్య అతిథిగా కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి డా. చంద్రశేఖర్ పెమ్మసాని హాజరై, రమజాన్ మరియు ఈద్-ఉల్-ఫిత్ర్ శుభాకాంక్షలు తెలిపారు. రమజాన్ అనేది ఆకలి గురించి మాత్రమే కాదు, మానవతను స్మరించుకునే అవకాశం అని పేర్కొన్నారు. ముస్లిం సామాజిక సమస్యలపై దృష్టి పెట్టి, వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. AMANA ప్రతినిధి నసీం షేక్ మాట్లాడుతూ, ఉత్తర అమెరికాలోని ఆంధ్ర ముస్లిం కుటుంబాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు, ఆంధ్రప్రదేశ్‌లో సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు సంస్థ స్థాపించబడిందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో షాజహాన్ షేక్, రియాజుద్దీన్ షేక్, అబ్దుల్ మాజిద్, జమీరుద్దీన్ మొహమ్మద్, ముజాహిద్ షేక్, సిద్దిఖ్, ముస్తఫా, ఇస్మాయిల్ పెనుకొండ, జాకీర్, నవీదుద్దీన్, ఇంతియాజ్, బాల చెరుకూరి, భాను ప్రకాష్, పవన్ బెల్లం, విజయ్ బొర్రా, రామ్ గుళ్ళపల్లి తదితరులు పాల్గొన్నారు.

Tags-Pemmasani Attends AMANA DFW Dallas Eid Milap

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles